Begin typing your search above and press return to search.

పార్ల‌మెంట్‌లో బిడ్డ‌కు పాలిచ్చిన ఎంపీ..రికార్డ్‌!

By:  Tupaki Desk   |   10 May 2017 10:55 AM GMT
పార్ల‌మెంట్‌లో బిడ్డ‌కు పాలిచ్చిన ఎంపీ..రికార్డ్‌!
X
ఆస్ట్రేలియా పార్ల‌మెంటులో అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎంపీ లారిసా వాట‌ర్స్ త‌న మాతృత్వాన్ని చాటుకుంది. తన రెండు నెల‌ల కూతురికి పార్ల‌మెంట్ ఛాంబ‌ర్‌లోనే పాలు ఇచ్చింది. పార్ల‌మెంట్ హాల్‌లో త‌ల్లి పాలు తాగిన‌ ఎంపీ కూతురిగా రెండు నెల‌ల అలియా జాయ్‌ రికార్డు సృష్టించింది. దీంతో క్వీన్స్‌లాండ్‌లోని గ్రీన్ పార్టీకి చెందిన లారిసా వాట‌ర్స్ ఆస్ట్రేలియా పార్ల‌మెంట్‌ ప్ర‌వేశ‌పెట్టిన ఫ్యామిలీ ఫ్రెండ్లీ నియ‌మావ‌ళిని వాడుకున్న తొలి ఎంపీగా నిలిచింది. త‌ల్లి పాలు తాగే చిన్నారులు ఉన్న ఎంపీలు త‌మ పిల్ల‌ల్ని ఇక నుంచి స్వేచ్ఛ‌గా పార్ల‌మెంట్‌కు తీసుకురావ‌చ్చు.

గ‌తంలో చిన్న పిల్ల‌ల‌కు ఆసీస్ పార్ల‌మెంట్ ఛాంబ‌ర్‌లోకి అనుమ‌తి ఉండేదికాదు. అయితే గ‌త ఏడాది ఫ్రిబ‌వ‌రిలో ప్ర‌వేశ‌పెట్టిన కొత్త రూల్స్ వ‌ల్ల ఎంపీ త‌ల్లుల‌కు ఈ వెస‌లుబాటు క‌ల్పించారు. కొన్ని సంద‌ర్భాల్లో బేబీలకు బ్రెస్ట్‌ఫీడింగ్ చేసే ఎంపీలు కీల‌క స‌మావేశాలు మిస్స‌య్యేవారు. దాంతో పార్ల‌మెంట్ నియ‌మ‌వాళిలో కొన్ని మార్పులు తీసుకువ‌చ్చారు. సోమ‌వారం ఓటింగ్ స‌మ‌యంలో ఎంపీ లారిసా వాట‌ర్స్ త‌న కూతురికి పాలు ఇచ్చింది.