Begin typing your search above and press return to search.
5లక్షల లోపు ధరలో ఎలక్ట్రిక్ కారు.. ఎంతో ముద్దుగా ఉందో..!
By: Tupaki Desk | 3 Jan 2023 2:30 PM GMTపర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే క్రమంలోనే ఎలక్ట్రికల్ వెహికల్స్ ను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పెట్రోల్.. డీజీల్ వాహనాలతో పొలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలతో కాలుష్యం పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలోనే ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వాహనాల హవా ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వాహనదారులు సైతం ఈవీ వెహికల్స్ ను కొనుగోలు చేసేందుకు ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే మార్కెట్లోకి కొత్త కొత్త మోడల్స్ లో ఎలక్ట్రికల్ వాహనాలు అడుగు పెడుతున్నాయి. టూ వీలర్.. త్రీ వీలర్స్.. ఫోర్ వీలర్ అమ్మకాల జోరుగా పెరిగింది. యూత్ ఎక్కువగా ఎలక్ట్రికల్ బైక్స్.. కార్లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త మోడల్స్ ఆటో మొబైల్ మార్కెట్ ను గత కొద్దిరోజులుగా ఊపేస్తున్నాయి.
కరోనా ఎంట్రీ తర్వాత మధ్యతరగతి ప్రజలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కంటే కూడా సొంత వెహికల్స్ లోనే వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సెకండ్ హ్యాండ్ కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే 5లక్షల లోపే కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలోనే చైనాకు చెందిన గిలీ కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి తీసుకు వస్తుంది.
పాండా మినీ ఈవీ పేరుతో జీలీ తీసుకు వస్తున్న ఈ మోడల్ కారు తక్కువ ధరలోనే మార్కెట్లోకి రాబోతుంది. ఈ ఏడాదిలోనే ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. దీని ధర సుమారు రూ. 5 లక్షల లోపే ఉండవచ్చని తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే చైనాలో ఈ కారు దుమ్మురేపే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పాండా మినీ ఈవీ టాటా నానో కారు కన్నా చిన్నదిగా ఉండటం గమనార్హం. టాటా నానో కారు పొడవు 3099 ఎంఎం అయితే ఈ కొత్త కారు రేంజ్ 3065 ఎంఎం అని తెలుస్తోంది. ఈ కారు రేంజ్ 150 కిలోమీటర్లు కాగా ఇందులో 30 కేడబ్ల్యూ ఎలక్ట్రిక్ మోటార్ ఉండనుంది. చైనాలో మినీ కార్లకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో పాండా మినీ కారు ఇతర కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.
ఈకంపెనీ ఈ కొత్త కారును జియోమీ బ్రాండ్ కింద మార్కెట్‌లోకి తీసుకురావొచ్చని చాలామంది ఊహించారు. అయితే కంపెనీ మాత్రం దీన్ని జీలీ బ్యానర్ కింద మార్కెట్‌లో ఆవిష్కరించింది. కాగా ఈ ఏడాది మన దేశంలో టాటా మోటార్స్.. మారుతీ సుజుకీ.. మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు సైతం కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.