Begin typing your search above and press return to search.
ఏపీ సచివాలయంలో మహమ్మారి కలకలం
By: Tupaki Desk | 2 July 2020 11:30 AM GMTఏపీలో మహమ్మారి కోరలు చాస్తోంది. జగన్ సర్కారు రోజు వేల సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తున్నా సరే మహమ్మారి విస్తృతి ఆగడం లేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సచివాలయంతోపాటు సీఎం జగన్ కార్యాలయం లోనూ మహమ్మారి వెలుగు చూసింది. ఆ ఉపద్రవం మరువక ముందే మరో కలకలం..
ఏపీ సచివాలయం లో మరో సారి మహమ్మారి కలకలం రేపింది. ఇటీవల వైద్య ఆరోగ్యశ శాఖ సచివాలయం ఉద్యోగులకు మహమ్మారి పరీక్షలు నిర్వహించగా ఫలితాలు ఈరోజు వెల్లడయ్యాయి.
అసెంబ్లీలో ఇద్దరికీ, సచివాలయంలో 10 మందికి.. జలవనరుల శాఖలో ముగ్గురికి, పశు సంవర్ధకశాఖలో ఒకరికి మహమ్మారి నిర్ధారణ అయ్యింది.
దీంతో మహమ్మారి సోకిన వారిని వారి తో సన్నిహితం గా మెలిగిన పలువురు ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలని అధికారులు ఆదేశించారు.
ఉన్నతాధికారులు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వడం తో చాలా మంది ఉద్యోగులు ఇవాళ సచివాలయం రాకుండా ఇంటికి వెళ్లి పోయారు.