Begin typing your search above and press return to search.

ఈఎంఐ కట్టే వారికి కేంద్రం ‘శుభవార్త’

By:  Tupaki Desk   |   21 Nov 2016 4:33 PM GMT
ఈఎంఐ కట్టే వారికి కేంద్రం ‘శుభవార్త’
X
దాదాపు పద్నాలుగు రోజలు క్రితం దాదాపుగా ఇదే సమయానికి (రాత్రి 8 గంటల వేళలో) ప్రధాని మోడీ టీవీ స్ర్కీన్ ల మీదకు వచ్చేసి.. జాతి జనులను ఉద్దేశించి ప్రసంగించటం మొదలుపెట్టారు. వేళ కాని వేళలో ప్రధాని జాతి జనులతో మాట్లాడటం కాసింత విస్మయానికి గురి చేయటం.. అందులో నుంచి బయటకు వచ్చే లోపలే.. పెద్ద నోట్ల రద్దు అంటూ సంచలన నిర్ణయాన్ని వెల్లడించి.. కొన్ని గంటల పాటు మైండ్ బ్లాక్ అయ్యే మాటను చెప్పేశారు.

ఆ క్షణం నుంచి మొదలైన షాకులు.. రోజురోజుకీ పెరుగుతున్నాయే కానీ తగ్గని పరిస్థితి. నోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల మీద పడింది. అది.. ఇది అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయాన్ని మర్చిపోలేం.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో చేతిలో డబ్బుల్లేని తీవ్ర ఇబ్బందులకు దేశ ప్రజలు గురి అవుతున్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. వాటిని తెచ్చుకోవటానికి పరిమితులతో పాటు.. బ్యాంకుల వద్ద బారులు తీరిన క్యూలతో గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్ర అవస్థలకు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం.. కొన్ని వర్గాలకు ఊరటనిచ్చేలా కొత్త నిర్ణయాన్ని తీసుకుంది.

కోటి రూపాయిలు లోపు వ్యవసాయ.. వ్యాపార.. పర్సనల్.. హోం లోన్లు తీసుకున్న వారు తాము కట్టాల్సిన వాయిదా (ఇన్ స్టాల్ మెంట్)ను కట్టేందుకు 60 రోజుల వెసులుబాటు కల్పించింది. ఈఎంఐలు కట్టేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలకు.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం నిజంగానే శుభవార్తేనని చెప్పక తప్పదు.

నెల వారీగా కట్టాల్సిన వాయిదా మొత్తాన్ని 60 రోజుల తర్వాత కట్టినా ఎలాంటి ఫైన్లు లేకుండానే కట్టేయొచ్చు. బ్యాంకుల వద్ద నెలకొన్ని భారీ క్యూల నేపథ్యంలో.. రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఈఎంఐలు కట్టాల్సిన వారికి భారీ ఊరట కలిగినట్లేనని చెప్పక తప్పదు. లోన్లు తీసుకొని.. సకాలంలో ఈఎంఐ కట్టలేక తీవ్ర అవస్థలు పడుతూ.. తమ సిబిల్ స్కోరింగ్ ఎక్కడ ప్రభావితం అవుతుందన్న బాధ.. తాజా నిర్ణయంతో తీరటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/