Begin typing your search above and press return to search.
టోర్నీలో చెస్ క్రీడాకారిణికి ప్రపోజ్ చేసిన జర్నలిస్ట్
By: Tupaki Desk | 27 Sep 2018 5:16 AM GMTసినిమాల్లో జరిగే సీన్ ఒకటి రియల్ లైఫ్ లో చోటు చేసుకుంది. ఊహించని రీతిలో జరిగిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. కొలంబియన్ చెస్ క్రీడాకారిణికి టోర్నీ జరుగుతున్న వేళ ప్రపోజ్ చేసిన వైనం ఒక ఎత్తు అయితే.. ప్రపోజ్ చేసిన వ్యక్తి భారత జర్నలిస్ట్ కావటం మరో విశేషంగా చెప్పాలి. వైరల్ గా మారిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
వేర్వేరు దేశాలకు చెందిన ఈ యువ జంట ఒక్కటైన వైనం సినిమాటిక్ గా ఉండటమే కాదు.. ప్రపోజ్ చేసిన సదరు జర్నలిస్ట్ గతంలో చెస్ క్రీడాకారుడు కావటం మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి. మరింత చిత్రమైన వైనం ఏమంటే.. ఈ ఇద్దరికి మాట్లాడుకునేందుకు కామన్ భాష రాకున్నా.. కిందామీదా పడిన వైనం ఒక ప్రత్యేకతగా చెప్పాలి.
కొలంబియాకు చెందిన చెస్ క్రీడాకారిణి ఎంజిలా లోపెజ్ కు భారత జర్నలిస్ట్ కమ్ మాజీ చెస్ క్రీడాకారుడు నిఖిలేశ్ జైన్ తాజాగా ప్రపోజ్ చేశాడు. అతగాడి ప్రపోజ్ కు ఎగ్జైంటీకి గురైన క్రీడాకారిణి టోర్నీ జరుగుతుండగా ఓకే చెప్పేసింది. ఈ సన్నివేశంలో వీరిద్దరే కాదు.. 189 దేశాలకు చెందిన చెస్ క్రీడాకారులు ఉండటం విశేషం.
నిజానికి ఈ వేదిక మీదనే తాను ప్రపోజ్ చేయాలని భావించినట్లుగా నిఖిలేశ్ చెబుతున్నారు. తన వరకు చూస్తే.. ప్రపంచంలో ఇంతకు మించిన బెస్ట్ ప్లేస్ ఉండదని.. మాజీ చెస్ క్రీడాకారుడిగా 189 దేశాలకు చెందిన క్రీడాకారులు ఆడుతున్న ప్రదేశం తనకు దేవాలయంతో సమానమని.. అలాంటి చోట ప్రపోజ్ చేస్తే బాగుంటుందని తానీ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పాడు.
జార్జియాలో తాజాగా జరుగుతున్న ఒలింపియాడ్ లో పాల్గొనేందుకు వచ్చిన ఎంజిలా లోపేజ్ కొందరితో మాట్లాడుతున్న వేళ.. నిఖిలేశ్ కిందకు కూర్చొని ఆమెకు ప్రపోజ్ చేశాడు. చేతిలో ఉంగరం పట్టుకొని ఎంగేజ్ మెంట్ కు రెఢీ అయ్యాడు. ఊహించని ఈ పరిణామాన్ని పాజిటివ్ గా తీసుకున్న ఆమె.. నవ్వుతూ ఓకే చేశారు. వాస్తవానికి వారిద్దరికి కొంతకాలంగా మంచి పరిచయం ఉంది. కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. టోర్నీలో ప్రపోజ్ చేయటానికి నిఖిలేశ్ కు ఒక మహిళ సాయం చేసింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. తాను ప్రపోజ్ చేసిన చెస్ క్రీడాకారిణి సోదరే.
తామిద్దరం ఏడాదిన్నరగా డేటింగ్‌లో ఉన్నామని.. తమకు భాషాపరమైన ఇబ్బందులు ఉన్నా..గూగుల్ ట్రాన్సలేటర్ తో మేనేజ్ చేస్తున్నట్లుగా చెప్పారు. చెస్ టోర్నీలో భాగంగా తామిద్దరం కలిశామని.. తనకు హిందీ మాత్రమే వచ్చని.. ఆమెకు స్పానిష్ బాగా వచ్చని.. ఇద్దరికి కొద్దికొద్దిగా ఇంగ్లిషు వచ్చని..గూగుల్ సాయంతో తాము సెల్ ఫోన్లలో చాట్ చేసుకునే వాళ్లమని చెప్పారు. మొత్తానికి సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతం ఇప్పుడు పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.