Begin typing your search above and press return to search.
అక్రమంగా అమెరికాకు వలస వెళుతూ భారతీయుడి మృతి..!
By: Tupaki Desk | 26 Dec 2022 5:04 PM GMTమెక్సికో.. అమెరికా సరిహద్దు ప్రాంతంలో నిర్మించిన 30 అడుగుల ట్రంప్ వాల్ ను కుటుంబంతో సహా దాటే క్రమంలో ఓ భారతీయుడు మృతి చెందాడం విషాదంగా మారింది. అంతేకాకుండా ఈ ఘటనలో అతడి భార్య.. మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లా కలోల్ సమీపంలోని బోరిసానా గ్రామంలో పటేల్.. ఠాకూర్ వర్గాలకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో సుమారు 3వేల జనాభా ఉంది. వీరిలో యువకుల సంఖ్య చాలా తక్కువ. ఎందుకంటే వీరంతా పని కోసం విదేశాలకు వెళుతుంటారు.
ఈ క్రమంలోనే గుజరాత్ లో స్థిరపడిన బ్రిజ్ కుమార్ త్వరగా డబ్బు సంపాదించాలని అక్రమంగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. తన కుటుంబ సభ్యులకు నెలరోజులపాటు టూర్ వెళుతున్నాని చెప్పి తన భార్య పూజ.. మూడేళ్ల కుమారుడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు.
అయితే కొన్ని రోజుల తర్వాత బ్రిజ్ కుమార్ బ్రెయిన్ హెమరేజ్ తో చనిపోయాడని ఇంటికి ఫోన్ వచ్చిందని ఆయన సోదరుడు వినోద్ తెలిపాడు. కాగా బ్రిజ్ కుమార్ అక్రమంగా విదేశాలకు వెళుతూ చనిపోయినట్లు తమకు తెలియదని ఆయన చెప్పడం గమనార్హం. బ్రిజ్ కుమార్ ఇంటి నుంచి వెళ్లాక అతడి భార్య పూజ తాము బాగానే ఉన్నామని పలుసార్లు ఫోన్ చేసినట్లు బిజ్ కుమార్ సోదరుడు చెప్పాడు.
ఆయన మరణ వార్త విని తన ఆరోగ్యం కూడా క్షిణించిందని వాపోయాడు. అతడి మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేలా ప్రభుత్వం తీసుకురావాలని ఆయన వేడుకుంటున్నాడు. ఈ విషయంపై గాంధీనగర్ అదనపు రెసిడెంట్ కలెక్టర్ జోషి మాట్లాడుతూ అమెరికా నుంచి ఈ ఘటనపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిపారు.
అయితే బ్రిజ్ కుమార్ ఉత్తర ప్రదేశ్ కు చెందినవాడని.. అతడి కుటుంబంతో కలోల్ లో నివసించే వాడని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఆయన భార్య.. కుమారుడు ఏజెంట్ ద్వారా విదేశాలకు వెళుతూ ‘ట్రంప్ వాల్’ దాటే క్రమంలో మరణించారని తెల్సిందని చెప్పారు. ఇదే ఘటనలో ఆయన భార్య.. కుమారుడు గాయపడి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఈ ఘటనపై అమెరికా ఎంబసీని తాము సంప్రదిస్తున్నామని చెప్పారు. దర్యాప్తు కొనసాగుతోందని.. అధికారిక సమాచారం కోసం తాము ఎదురు చూస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. గాంధీనగర్ సీఐడీ అధికారి ఒకరు మాట్లాడుతూ అమెరికా ఎంబసీ నుంచి అధికారిక సమాచారం వచ్చాకే ఎఫ్ఆర్ఐ నమోదు అవుతుందని వెల్లడించారు.
బ్రిజ్ కుమార్ తరహాలోనే ఉత్తర గుజరాత్ లోని దింగుచా గ్రామానికి చెందిన ఓ కుటుంబం సైతం కెనడా వెళ్లేందుకు ప్రయత్నించి మృతిచెందారు. అయితే మరొక ఘటనలో అమెరికా కెనడా సరిహద్దుల్లో జగదీష్.. వైశాలిబెన్ పటేల్.. వారి ఇద్దరు కుమారులు మరణించడం శోచనీయంగా మారింది.
కాలినడక కెనడా నుంచి అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించి రాత్రి చలి ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీ సెల్సియస్ ఉండటంతో అధిక చలికి వారంతా మృతి చెందారని సీఐడీ క్రైమ్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అక్రమంగా విదేశాలకు వ్యక్తుల పంపుతున్న ట్రావెల్ ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని ప్రతీఒక్కరూ కోరుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.