Begin typing your search above and press return to search.
మోడీ గడ్డంలా పెరుగుతున్న పెట్రో ధరలు.. షర్ట్ తీసి ఉద్యమించిన సీపీఐ నారాయణ..!
By: Tupaki Desk | 18 July 2021 5:16 PM GMTదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలపై భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమించింది. సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీలోని తిరుపతిలో ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా.. పెట్రో ధరల పెంపుపై వాహనదారుల అభిప్రాయం సేకరించారు నారాయణ.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. మోడీ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్ ధరలు మోడీ గడ్డం మాదిరిగా పెరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. కరోనా కాలంలో ప్రజలు ఉపాధి లేక అవస్థలు పడుతుంటే.. పెట్రో ధరలు హద్దూ పద్దూ లేకుండా పెరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పెట్రోల్, డీజిల్ ను వెంటనే జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని డిమాండ్ చేశారు.
పెట్రోల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పన్నులే అధికంగా ఉన్నాయని మండి పడ్డారు. పన్నులు వేయడంలో నరేంద్ర మోడీ సర్కారుతో రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని ధ్వజమెత్తారు. తమిళనాడుతో పోలిస్తే.. ఆంధ్రప్రదేశ్ లో లీటరు పెట్రోల్ పై 7 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని అన్నారు.
అయితే.. తనదైన పోరాటంతో నిత్యం వార్తల్లో నిలిచే నారాయణ.. ఇప్పుడు ఏకంగా చొక్కా విప్పేసి మరీ ఉద్యమించారు. నాయకులతో కలిసి షర్ట్ తీసేసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ ఉన్నవారంతా అవాక్కయ్యారు. గతంలో గాంధీ జయంతి రోజున చికెన్ తిని ఫేమస్ అయిన నారాయణ.. ఆ తర్వాత ఏదో ఒక వింత చర్యతో వార్తల్లో నిలుస్తున్నారు.