Begin typing your search above and press return to search.

ఈ ఇద్దరి ఉద్వాసనకు ‘అంతర్జాతీయ’ దెబ్బ ?

By:  Tupaki Desk   |   8 July 2021 4:50 AM GMT
ఈ ఇద్దరి ఉద్వాసనకు  ‘అంతర్జాతీయ’ దెబ్బ ?
X
నరేంద్రమోడి తాజగా చేసిన మంత్రివర్గ ప్రక్షాళనలో 12 మందికి ఉద్వాసన చెప్పేశారు. ఇంతమందికి ఉద్వాసన పలకటం పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. కాకపోతే వీరిలో ముగ్గురు ప్రకాష్ జావదేకర్, రవిశంకర్ ప్రసాద్, డాక్టర్ హర్షవర్ధన్ లను బయటకు పంపేయటాన్ని చాలామంది నమ్మకలేకపోయారు. ఎందుకంటే వీరిముగ్గురు గడచిన ఏడేళ్ళుగా మోడి టీములో చాలా కీలకంగా వ్యవహరించారు. అలాగే మోడికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన వారు.

సరే ఈ ముగ్గురిలో కూడా జవదేకర్ విషయాన్ని పక్కన పెట్టేసినా రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్ లకు ఉద్వాసన పలకటానికి అంతర్జాతీయ కారణాలున్నట్లు సమాచారం. ఇంతకీ అంతర్జాతీయ కారణాలు ఏమిటంటే ఒకటి ట్విట్టర్ వివాదం, రెండోది కరోనా వైరస్ తీవ్రత. ఐటి శాఖమంత్రిగా రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ వివాదాన్ని సమర్ధవంతంగా కంట్రోల్ చేయలేకపోయారని మోడి తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.

రెండు రోజుల క్రిందటే అంతర్జాతీయస్ధాయిలో మీడియా విషయాల్లో నియంతలాగ వ్యవహరించే పాలకుల జాబితాలో మోడి ఉన్నారంటు గోల గోలైపోయింది. ఏకంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ సరసన అంతర్జాతీయ మీడియా మోడిని ప్రొజెక్టుచేసింది. ట్విట్టర్ వివాదంలో దేశం విధానాన్ని చెప్పటంకన్నా తన సొంత వాదాన్ని వినిపించటం వల్లే తనకు అంతర్జాతీయస్ధాయిలో నియంతగ ముద్రపడిందని మోడి మండిపోయారట. అంతర్జాతీయ సర్వే కూడా మంత్రివర్గ ప్రక్షాళనే రోజు వెలుగుచూసింది.

ఇక కరోనా వైరస్ తీవ్రత కారణంగా అంతర్జాతీయంగా భారత్ పరువు గంగలో కలిసిపోయింది. టీకాల కార్యక్రమం, ఆక్సిజన్ సరఫరాలో నరేంద్రమోడి ఫెయిలయ్యారంటు అంతర్జాతీయ మీడియా మోడి పరువు తీసేసింది. న్యూయార్క టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బీబీసీ లాంటి అనేక అంతర్జాతీయ మీడియా మోడికి వ్యతిరేకంగా అనేక వార్తలు, కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. దీని కారణంగా మోడికి అంతర్జాతీయస్ధాయిలో బాగా చెడ్డపేరొచ్చింది. తనపై జరిగిన నెగిటివ్ ప్రచారానికి హర్షవర్ధన్ ఫెయిల్యూరే కారణమని మోడి గట్టిగా నిర్ధారణకొచ్చారట. అందుకే వీళ్ళద్దరి ఉద్వాసనకు చివరి నిముషంలో నిర్ణయం తీసుకుని బయటకు పంపేశారు.