Begin typing your search above and press return to search.
రేపిస్ట్ పై పక్కా ఆధారాలు!..అయినా శిక్ష లేదు!
By: Tupaki Desk | 18 April 2019 1:30 AM GMTనిజంగానే ఈ కేసు వింతల్లోకెల్లా వింత కేసే. ఎందుకంటే... ఓ యువతిపై అత్యాచారం చేసిన యువకుడు... అరెస్టయ్యాడు - ఆధారాలూ ఉన్నాయి... ఆ విషయాన్ని కేసును విచారించిన న్యాయమూర్తి కూడా చెప్పేశారు... అయినా కూడా ఆ నిందితుడికి శిక్ష వేయలేనని చెప్పేసిన న్యాయమూర్తి... అతడిని విడుదల చేస్తూ సంచలన తీర్పు చెప్పారు. అత్యాచారం జరిగిన మాట నిజమే. యువకుడు అరెస్ట్ కూడా అయ్యారు. ఈ కేసులో పక్కా ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా శిక్ష లేకుండా ఆ యువకుడు ఎంచక్కా విడుదలయ్యాడండే... ఈ కేసు వింత కేసు కాక మరేమిటి? నిజమే కదా... ఈ కేసు వింతల్లోకెల్లా వింత కేసే. అయితే ఈ కేసు వివరాల్లోకి వెళదాం పదండి.
బ్రిటన్ కు చెందిన 17ఏళ్ల యువతి యూరప్ కు చెందిన నౌకలో ప్రయాణం చేసింది. ఆమెతో పాటు తన తల్లిదండ్రులు కూడా ప్రయాణిస్తున్నారు. వీరంతా పల్మా రాజధాని మలోర్కన్ నుంచి స్పెయిన్ లోని వాలెన్సియాకు వెళుతున్నారు. ప్రయాణం సాఫీగా సాగుతుందనుకుంటున్న సమయంలో విలన్ లా ఎంటరైన ఇటలీకి చెందిన ఓ యువకుడు... ఆ యువతి నౌకలో పచార్లు చేస్తుండగా... ఆమెను తన క్యాబిన్ లోకి లాక్కున్నాడు. ఆపై అత్యాచారం చేశాడు. నౌక సముద్రం మధ్యలో ఉండటంతో మరుసటి రోజు పనామాకు చేరుకున్న తర్వాత యువతి ఫిర్యాదు మేరకు ఆ కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టుకూ తరలించారు. ఇక్కడే అసలు సిసలు ట్విస్టు చోటుచేసుకుంది.
కేసు విచారణ చేసిన జడ్జి అన్ని సాక్షాధారాలు పక్కాగా ఉన్నప్పటికీ నిందితుడిని విడుదల చేస్తూ సంచలన తీర్పు వెల్లడించారు. అందుకు ఆ జడ్జి చెప్పిన కారణం కూడా ఆసక్తికరంగానే ఉంది. నిందితుడిపై చేయబడ్డ ఆరోపణ లేదా అత్యాచారానికి పాల్పడిన ప్రాంతం ఏ పరిధిలోకి వస్తుందో తెలియడం లేదని ఆ జడ్జి వివరణ ఇచ్చారు. ఒక విదేశీ యువతిపై మరో విదేశీ యువకుడు అంతర్జాతీయ జలాల మధ్య అత్యాచారం చేశాడని... ఇది తమ పరిధిలోకి రాదని... అందుకే శిక్షించడం కుదరదని జడ్జి వెల్లడించారు. జడ్జి ఈ తరహా వివరణ ఇవ్వడానికి 2009లో స్పెయిన్ తన చట్టాల్లో చేసిన మార్పు కారణంగా నిలిచిందని చెప్పాలి. తమ దేశంలో కాకుండా విదేశాల్లో స్పెయిన్ దేశస్తుడు నేరం చేస్తే దానికి సంబంధించిన విచారణ విదేశీ కోర్టుల్లోనే జరగాలంటూ మార్పులు చేసింది.
ఇక నౌకలో జరిగిన అత్యాచార ఘటనపై జడ్జి కేవలం నేరం ఎక్కడ జరిగిందనే దానినే పరిగణలోకి తీసుకున్నారని స్పెయిన్ మీడియా తెలిపింది. అయితే తాజాగా బ్రిటీష్ - ఇటాలీ - పనామా అధికారులను జడ్జి పిలిపించి అసలు ఆ యువకుడి గురించి పూర్తి వివరాలను ఇవ్వాల్సిందిగా కోరినట్లు స్పెయిన్ మీడియా కథనాలను ప్రసారం చేసింది. మొత్తంగా అత్యాచారం జరగడం - నిందితుడు అరెస్ట్ కావడం - ఆధారాలన్నీ పక్కాగానే ఉండటం... అయినా కూడా రేపిస్ట్ కు శిక్ష పడకపోవడంతో ఈ కేసును అత్యంత అరుదైన కేసుగానే పరిగణించాలన్న వాదన వినిపిస్తోంది.