Begin typing your search above and press return to search.
లోదుస్తులతో రైల్లో చక్కర్లు కొట్టిన ఎమ్మెల్యే.. నెటిజన్ల ట్రోలింగ్
By: Tupaki Desk | 3 Sep 2021 2:30 PM GMTఇంట్లో బట్టలు లేకుండా తిరిగితే చెల్లుతుంది. ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి.. కానీ బయట అలానే తిరిగితే ఉమ్మేస్తారు.. పబ్లిక్ ప్రదేశాల్లో అలా తిరిగితే ఇక ఊరుకోకుండా కొట్టేస్తారు. కానీ మన ఘనత వహించిన ఎమ్మెల్యే గారు ఏకంగా రైల్లో లోదుస్తులతో తిరిగేశారు. నన్ను ఎవడు అంటాడులే అని అలా రైల్లో బట్టలిప్పి బాగోతం ఆడేశాడు.
బీహార్ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన్ను నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆయన లోదుస్తులు ధరించి రైల్లో తిరగడమే.. ఈ ఘటన గురువారం పాట్నా నుంచి ఢిల్లీ వెళుతున్న తేజాస్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో చోటుచేసుకుంది.
బీహార్ కు చెందిన జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఏసీ బోగీలో ప్రయాణించారు. అయితే ఈ రైలు ఉత్తరప్రదేశ్ లోని దిల్ నగర్ స్టేషన్ దాటుతున్న సమయంలో ఎమ్మెల్యే తన దుస్తులు తీసేసి కేవలం లోదుస్తులు ‘బనియన్, అండర్ వేర్)తో వాష్ రూమ్ కు వెళ్లారు. అదే కంపార్ట్ మెంట్ లో బీహార్ కు చెందిన ప్రహ్లాద్ పాశ్వాన్ అనే వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. ఎమ్మెల్యే అవతారం చూసిన ఆ వ్యక్తి మండల్ వేషధారణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మండల్ ఆ వ్యక్తితో గొడవ పడ్డాడు. అక్కడితో ఆగకుండా ఇతర ప్రయాణికులను దూషించాడు.
మండల్ ప్రయాణికులను కొట్టేందుకు ప్రయత్నించాడని.. వారు ఎమ్మెల్యే ప్రవర్తనపై మండిపడడంతో కాల్చివేస్తానని బెదిరించాడని పాశ్వాన్ ఆరోపించారు. ఆయన బీహార్ ఎమ్మెల్యే అని తమకు తెలియదని రైల్లో ప్రయాణికుడు తెలిపారు. దీనిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బట్టల్లేకుండా తిరిగిన ఘటనపై ఎమ్మెల్యే మండల్ తన చర్యలను సమర్థించుకున్నాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తన కడుపునొప్పి ఉందని అందుకే కేవలం లోదుస్తులు ధరించినట్టు తెలిపారు.
అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే లోదుస్తులు ధరించిన ఫొటోలు, వివరణ ఇచ్చిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ ఆడుకుంటున్నారు. అండర్ వేర్ లో తిరిగితే కడుపునొప్పి తగ్గుతుందా? అని సైటెర్లు వేస్తున్నారు.