Begin typing your search above and press return to search.
కాంట్రాక్టర్ ను బురదలో కూర్చోబెట్టి.. నెత్తిన చెత్తవేయించిన ఎమ్మెల్యే!
By: Tupaki Desk | 13 Jun 2021 2:01 PM GMTడ్రెయినేజీ పనులు సరిగా చేయలేదని ఓ కాంట్రాక్టరును బురదలో కూర్చోబెట్టి, రోడ్డు మీద ఉన్న చెత్తను అతనిపై వేయించాడో ఎమ్మెల్యే. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు ముంబై వీధులను వరదనీరు ముంచెత్తింది. దీంతో.. చండీవలి ప్రాంతంలో డ్రైనేజీ మరమ్మతులు చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే.
ఎమ్మెల్యే చెప్పి రెండు వారాలు గడిచినా.. సదరు కాంట్రాక్టర్ పనులు చేయలేదట. దీంతో.. శివసేన కార్యకర్తలు ఆ సమస్య పరిష్కరానికి సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టరు అక్కడికి చేరుకున్నాడు. అతన్ని చూడగానే.. కట్టలు తెంచుకున్న ఆవేశంతో రెచ్చిపోయారు ఎమ్మెల్యే అనుచరులు.
తీవ్రంగా బూతులు తిట్టిన తర్వాత.. సదరు కాంట్రాక్టర్ ను రోడ్డుపై ఉన్న డ్రైనేజీ బురద నీటిలోనే కూర్చోవాలని బెదిరించారు. కూర్చునే వరకు వదిలి పెట్టలేదు. అయినా.. ఆగకుండా రోడ్డుపక్కన ఉన్న చెత్త అతడి నెత్తిపై వేయించారు. ఇదంతా.. ఎమ్మెల్యే దిలీప్ లాండే సమక్షంలోనే జరగడం గమనార్హం.
ఈ చర్యను ఎమ్మెల్యే సమర్థించుకున్నారు. కాంట్రాక్టరు తన విధులు సరిగా నిర్వర్తించలేదని, అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఎమ్మెల్యే తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు.. పనిచేయని ఎమ్మెల్యేలను కూడా ఇలాగే చేయవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు జనం. తప్పు చేస్తే శిక్షించడానికి చాలా మార్గాలున్నాయని, ఇలా దారుణంగా వ్యవహరించాల్సిన అవసరం లేదని మండిపడుతున్నారు.