Begin typing your search above and press return to search.
ఎన్ఆర్ఐకి అందంతో ఎర.. దోచుకున్న మాయలేడి
By: Tupaki Desk | 23 Oct 2020 1:30 AM GMTఇన్నాళ్లు మన తెలుగు అమ్మాయిలను పెళ్లి పేరుతో మోసం చేసే ఎన్ఆర్ఐ అబ్బాయిలను చూశాం. కానీ ఇక్కడ ట్రెయిన్ రివర్స్ అయ్యింది. మన తెలుగువాడు, అమెరికాలో ఉద్యోగం చేస్తున్న తెనాలి యువకుడు ఓ మాయలేడి చేతిలో అడ్డంగా బుక్కయాడు. ఒకటి కాదు రెండు కాదు 7 లక్షలకు పైగా డబ్బులు పంపించి నిండా మునిగాడు. పెళ్లి పేరుతో అందమైన మోడల్ ఫొటోలు పంపించి ముగ్గులోకి దించి ఎన్ఆర్ఐ యువకుడిని నిలువుదోపిడీ చేసింది ఓ మాయలేడి.
పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో ఫొటో పెట్టిన తెనాలి యువకుడి బయోడేటా ఓ లేడి కంటపడింది. అమెరికా అబ్బాయి, ఆకర్షనీయ జీతం.. పైగా పెళ్లి కోసం ఆవురావురుమంటూ ఉన్నాడని గ్రహించింది. బయోడేటా చెక్ చేస్తే మంచి సౌండ్ పార్టీ తేలింది. దీంతో ఓ మాయలేడి యువకుడిని ఫోన్ లో సంప్రదించింది.. తన పేరు ‘మైనేని సముద్ర’ అని.. తనది ప్రకాశం జిల్లా ఉలవపాడు స్వగ్రామం అని నమ్మబలికింది. న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నానని.. గ్రీన్ కార్డు హోల్డర్ నంటూ మాయమాటలు చెప్పింది. దీంతో నీ ఫొటోలు పంపమని ఎన్ఆర్ఐ యువకుడు అడిగేశాడు. ఫోన్ లో మాటలు కలిపాడు.
ఈ క్రమంలోనే ఒక అందమైన వర్ధమాన మోడల్ ఫొటోలను తన ఫొటోలుగా ఎన్ఆర్ఐ యువకుడికి పంపింది. ఆ ఫొటోలు చూసి ఫిదా అయిన యువకుడు ఇక మాటా మాట కలిపి పెళ్లికి ఓకే చెప్పాడు. తన తండ్రితో మాట్లాడండని.. ఆయన మద్రాస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంటూ ఓ ఫోన్ నంబర్ ను యువతి ఇచ్చింది. దీంతో తెనాలిలోని ఎన్ఆర్ఐ యువకుడి తల్లిదండ్రులు ఆయనను సంప్రదించారు.
ఈ క్రమంలోనే 21న స్వగ్రామం ఉలవపాడులో పెళ్లి చూపులకు రావాలని.. 24న నిశ్చిత్తార్థం చేసుకుందామని మాట్లాడుకున్నారు. ఈ లోపు బంగారం, బట్టలు కొనుగోలు చేద్దామని చెప్పి అబ్బాయి నుంచి విడతల వారీగా మాయలేడి రూ.7.20 లక్షలు తీసుకుంది.
ఇక పెళ్లి చూపులకు రెడీ అయిపోయిన అబ్బాయి కుటుంబ సభ్యులు, బంధువులు అన్నట్టుగానే 21న ప్రకాశం జిల్లా ఉలవపాడుకు వచ్చారు. ఆ ఊరుకు చేరుకునే సరికి మాయలేడి ఫోన్ నంబర్, ఆమె తండ్రి ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్ అయిపోయింది. ఆ గ్రామస్థులను అడగగా.. అలాంటి ఇంటిపేరు, మద్రాస్ యూనివర్సిటీలో చేసే వారే లేరని అన్నారు. దీంతో మోసపోయామని గ్రహించి ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు లబోదిబోమని తెనాలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇలా ఆన్ లైన్ మ్యాట్రిమోనిని నమ్మి ఓ ఎన్ఆర్ఐ యువకుడు నిండా మునిగాడు.