Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : మద్యం దొరకటం లేదని గొంతు కోసుకున్న ప్రబుద్దుడు
By: Tupaki Desk | 1 April 2020 5:45 AM GMTకరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలులో ఉండటంతో దేశవ్యాప్తంగా వైన్ షాపులు పూర్తిగా మూసివేశారు. లాక్ డౌన్ ప్రారంభం అయి వారం రోజులు గడుస్తుండటంతో మందుబాబులు చిత్ర, విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. విచిత్ర చేష్టలతో ఇంట్లో వారిపై దాడి చేయటం, తమను తాము గాయపర్చుకోవటం వంటి చర్యలకు దిగుతున్నారు. బెంగుళూరు లో ఓ మందు బాబు మద్యం దొరక్క పోవడంతో ఏకంగా తన గొంతు కోసుకోవటం సంచలనంగా మారింది. మద్యం కోసం ఏకంగా ప్రాణాన్నే ఫణంగా పెడతారా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... తుమకూరు జిల్లా మధుగిరి తాలూకా ఐడిహళ్ళి చిక్కదాళవాటకు చెందిన హనుమంతప్ప కొన్నేళ్లుగా మద్యానికి బానిసై పోయాడు. ప్రతి రోజు మందు తాగాల్సిందే. కానీ , ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ చేయడంతో మద్యం దొరకడంలేదు. దీనితో మందు దొరకలేదు అని రెండు రోజులుగా తిట్టుకుంటూ గడిపారు. ఆదివారం ఏకంగా గొంతు కోసుకున్నారు. తీవ్ర రక్తస్రావం కావడంతో స్థానికులు మధుగిరి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ..ఆ గ్రామాన్ని సందర్శించి, ఘటన పై పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఇక దక్షిణకన్నడ జిల్లాలో ఇరువురు. బీదర్ జి ల్లాలో ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వీరి ఆత్మహత్యల వెనుకా మధ్యంకు బానిసలుగా మారడమే కారణమని తెలుస్తోంది. లాక్ డౌన్ తర్వాత మద్యం, బీడీ, సిగరెట్‌లు, గుట్కాలు లభించక పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. తెలంగాణ లో కూడా పలువురు ఆత్మహత్య కి పాల్పడుతున్నారు.