Begin typing your search above and press return to search.
ఏళ్ల క్రితం చేసిన పోస్టును భలేగా తెర మీదకు తీసుకొచ్చిన క్రికెటర్
By: Tupaki Desk | 11 Jun 2020 5:30 AM GMTతప్పు చేశారే అనుకుందాం. ఆ వెంటనే స్పందించి..తన విషయంలో అంత తప్పు చేస్తారా? అని ప్రశ్నించటం.. న్యాయం కోసం అడగటాన్ని అర్థం చేసుకోవచ్చు. అందుకు భిన్నంగా కొన్నేళ్ల క్రితం చేసిన ఒక వ్యాఖ్యను.. అప్పట్లో కామ్ గా ఉండిపోయి.. ఇప్పుడు మాత్రం అదేదో పెద్ద తప్పు అయినట్లుగా గుండెలు బాదేసుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
వర్ణవివక్షతో అమెరికాలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. తనకెప్పుడో జరిగిందంటూ పాత విషయాన్ని పట్టుకొని రచ్చ చేస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ తీరును పలువురు తప్పు పడుతున్నారు. వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించి.. ఇప్పుడు మాజీగా మారిన డ్యారెన్ సమీ ఒక విషయాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.
తాను ఐపీఎల్ ఆదే వేళలో.. తనతో పాటు శ్రీలంక క్రికెటర్ ని నల్లవాళ్లు అంటూ టీమిండియా సభ్యులు కొందరు ఏడిపించినట్లుగా పేర్కొని సంచలనంగా మారాడు. హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తరఫున ఆడిన సమీ.. ఆ సమయంలో తనను వివక్షతో వేధించినట్లుగా చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారంగా అప్పట్లో ఫాస్ట్ బౌలర్ ఇసాంత్ చేసిన ఏళ్ల నాటి పోస్టును తాజాగా ప్రస్తావిస్తున్నాడు.
సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఆ ఫోటోలో సన్ రైజర్స్ కు చెందిన ఆటగాళ్లు నలుగురు సన్నిహితంగా కూర్చున్నారు. ఈ సందర్భంగా అందరి పేర్లను ప్రస్తావించిన ఇషాంత్.. సమీని మాత్రం కాలూ అని సంబోధించాడు. ఉత్తరాదివారు నల్లగా ఉండే వారిని తరచూ ఇలానే పిలుస్తారు. ఇదిలా ఉంటే.. అప్పుడెప్పుడో జరిగిన ఉదంతాన్ని ఇప్పుడు తెర మీదకు తెచ్చి లింకే వేసే ప్రయత్నం సరికాదంటున్నారు.
ఒకవేళ.. నిజంగానే నొచ్చుకొని ఉంటే అప్పుడే ఈ విషయాన్ని బయటపెట్టటం.. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ చేస్తే బాగుండేదంటున్నారు. అందుకు భిన్నంగా ఏళ్ల తర్వాత ఈ విషయాన్ని ప్రస్తావించటం.. వివాదాల్ని రాజేయటం సరకిాదంటున్నారు. అయితే.. దీనిపై ఇతర క్రికెటర్లు మరోలా వ్యాఖ్యానిస్తున్నారు. ఐపీఎల్ లో తాను ఆడుతున్న వేళ.. ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే.. ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో మౌనంగా ఉండి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒకవేళ.. అది నిజమేనని అనుకుంటే ఇంతకాలం ఆగకుండా.. గతంలోనే ప్రస్తావించి ఉంటే బాగుందంటున్నారు. కెరీర్ ముగిసిన తర్వాత.. గతంలో జరిగినవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ.. ఆరోపణల ముద్రలు వేయటం సరైన పద్దతి కాదన్న మాట వినిపిస్తోంది. మరి.. సమీ వ్యవహారం ఎక్కడివరకూ వెళుతుందో చూడాలి. ఈ క్రమంలో మరెన్ని కొత్త అంశాలు తెర మీదకు వస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.