Begin typing your search above and press return to search.

ఇద్దరు చంద్రుళ్లు వియ్యంకులు కానున్నారా?

By:  Tupaki Desk   |   11 May 2016 3:02 PM GMT
ఇద్దరు చంద్రుళ్లు వియ్యంకులు కానున్నారా?
X
తాజాగా ఒక అంశం పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు త్వరలో వియ్యంకులు కానున్నారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇద్దరు ముఖ్యమంత్రులకు పెళ్లీడుకు వచ్చిన పిల్లలు లేని నేపథ్యంలో ఇద్దరూ వియ్యంకులు ఎలా అవుతారన్న సందేహం కలగొచ్చు. కానీ.. ఈ ఇద్దరూ వియ్యంకులు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపించటం గమనార్హం.

ఇంతకీ ఇద్దరు చంద్రుళ్లు వియ్యంకులు అయ్యే అవకాశం ఎలా అంటే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెంపెడు కుమార్తె ప్రత్యూష కర్నూలు జిల్లాకు చెందిన మద్దిలేటిని ప్రేమించటం.. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలుకోవటం తెలిసిందే. సవతి తల్లి చేతిలో చిత్రహింసలు అనుభవించి.. అనంతరం బయటపడిన ఆమెకు తాను అండగా ఉంటానని.. ఆమె బాధ్యతను తాను తీసుకుంటానని కేసీఆర్ చెప్పటం తెలిసిందే.

తాజాగా ఆమె మద్దిలేటితో ప్రేమలో పడిన నేపథ్యంలో.. తన పెళ్లిని కేసీఆర్ చేతుల మీద చేసుకోవాలని భావిస్తోంది. మద్దిలేటి కూడా ప్రత్యూష పెళ్లి కేసీఆర్ చేతుల మీద జరగాలని చెప్పటమే కాదు.. తమ పెళ్లికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కల్పించుకొని కేసీఆర్ తో మాట్లాడాలని కోరుతున్నారు. ఒకవేళ మద్దిలేటి కోరుకున్నట్లు ఈ విషయం మీద బాబు స్పందించి.. అంతా అనుకున్నది అనుకున్నట్లు జరిగితే చంద్రుళ్లు ఇద్దరు వియ్యంకులు కావటం ఖాయం.