Begin typing your search above and press return to search.
వైరల్ః టాయిలెట్ సీటుపై అనకొండ.. ఎక్కడ కరిచిందో తెలుసా?
By: Tupaki Desk | 7 July 2021 2:30 AM GMTసాధారణ పామును చూస్తేనే.. జనాలు వణికిపోతారు. అలాంటిది అనకొండను చూస్తే..? వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. అలాంటి అనకొండ ఓ వ్యక్తిని కాటేసింది. అది కూడా ఎక్కడోకాదు. ఎవరూ ఊహించని చోట కాటువేసింది. టాయిలెట్ సీటు మీద కూర్చున్న వ్యక్తిని.. ఏకంగా మర్మాంగం మీద కరిచింది. ఈ దారుణ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది.
ఆస్ట్రియాకు చెందిన 65 ఏళ్ల వ్యక్తి తెల్లవారు జామున తన ఇంట్లోనే టాయిలెట్ లోకి వెళ్లాడు. అయితే.. ఆ టాయిలెట్ సీటు మీద అప్పటికే అనకొండ చుట్టుకొని పడుకుని ఉంది. ఈ వ్యక్తి వెళ్లి దానిమీద కూర్చున్నాడు. అప్పటికే ఏదో తేడాగా ఉందేంటని అనుకున్నాడట. కానీ.. తేరుకునేలోపే నష్టం జరిగిపోయింది.
ఆ పాము ఆయన మర్మాంగంపై కాటు వేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టగా ఆ పాము పక్కింట్లో నుంచి వచ్చిందని తేలింది. వెంటనే పక్కింటికి వెళ్లి విచారించిన పోలీసులు.. ఆ ఇంట్లోని 24 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.
ఎందుకంటే.. ఈ పామును ఆ వ్యక్తి పెంచుతున్నాడు. ఒకటే కాదు.. మొత్తం 11 పాములు పెంచుతున్నాడట. అందులోని ఒక పాము డ్రైనేజీ పైపుగుండా ప్రయాణించి.. ఈ టాయిలెట్లోకి వచ్చేసిందట. విదేశాల్లో పాములను కుక్కలు, పిలల్లుల మాదిరిగా కొందరు పెంచుతుంటారు. అలా పెంచిన ఆ యువకుడు.. ఈ పరిస్థితి కారణమయ్యాడు. అతన్ని అరెస్టుచేసిన పోలీసులు.. ఆ పాములను అడవుల్లో వదిలేసేందుకు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.