Begin typing your search above and press return to search.
సమరసింహారెడ్డి నిర్మాతకు జీవితఖైదు!
By: Tupaki Desk | 24 May 2017 10:53 AM GMTవిశాఖపట్టణంలోని అనకాపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పాయకరావు పేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు సహా15 మందికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 2007లో విశాఖ జిల్లా బంగారమ్మ పేటలో బీఎంసీ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కారణంగా ఒక వ్యక్తి మృతి చెందాడు. సదరు మత్స్యకారుడి మరణానికి అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న చెంగల, ఆయన అనుచరులే కారణమని పలువురు ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన అనకాపల్లి సెషన్స్ 10వ కోర్టు నేడు తీర్పు వెలువరించింది.
దాదాపు పదేళ్ల క్రితం జరిగిన ఈ ఉదంతంలో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావుతో పాటు మరో 20 మందికి యావజ్జీవ ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇదే కేసులో మరో ఐదుగురికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హీరోగా సమరసింహారెడ్డి సినిమాను నిర్మించిన చెంగల వెంకట్రావు ఆ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో ప్రముఖుడిగా మారారు. అనంతరం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి 1999,2004లో పాయకరావుపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఓటమిపాలయ్యారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన చెంగల 2014 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి పోటీ చేసినప్పటికీ టీడీపీ అభ్యర్థి వంగలపూడి అని చేతిలో ఓటమి పాలయ్యారు.