Begin typing your search above and press return to search.

నెల్లూరు పెద్దారెడ్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు..?

By:  Tupaki Desk   |   28 Feb 2019 4:46 AM GMT
నెల్లూరు పెద్దారెడ్లు ప్రస్తుతం ఏం చేస్తున్నారు..?
X
ఒకప్పుడు నెల్లూరు పెద్దారెడ్డి పేరుతో రాజకీయాలను శాసించిన కుటుంబాలు ప్రస్తుతం కునికిపాట్లు పడుతున్నాయి. ఒకప్పుడు భీ ఫారం కోసం ఎమ్మెల్యే అభ్యర్థులు వారి ఇళ్ల ముందు పడిగాపులు కాసేవారు. ఇప్పుడు వారికే టికెట్‌ వస్తుందా..? రాదా..? అన్న టెన్షన్‌ వారిలో ఉందట. ఇంతకీ నెల్లూరు పెద్దారెడ్లు ఎవరు..?

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఎక్కువగా ఉనికిని చాటుకున్న సామాజిక వర్గాల్లో రెడ్డి సామాజిక వర్గం ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనూ చక్రం తిప్పిన వీరు నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. ఆనం ఫ్యామిలీ - నేరురుమల్లి ఫ్యామిలీ - నల్లమరెడ్డి ఫ్యామిలీ ఇలా నెల్లూరు జిల్లాను శాసించిన వారిని పెద్ద రెడ్లుగా పిలుస్తారట. అయితే జిల్లాలో ఒక వెలుగు వెలిగిన ఈ కుటుంబాలు ఇప్పుడు రాజకీయంగా ఉనికిని చాటుకోవడానికి కిందామీద పడుతున్నాయి. దీంతో నెల్లూరు పెద్ద రెడ్ల పరిస్థితిపై జిల్లాలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఒకప్పుడు జిల్లా నేతలకు భీ ఫారం ఇచ్చిన ఈ నేతలు ఇప్పుడు పోటీ చేసే అవకాశం వస్తుందా..? రాదా..? అని ఎదురుచూస్తున్నాయట.

నెల్లూరు జిల్లాలో ఆనం ఫ్యామిలీకి ప్రత్యేక ఉంది. సుబ్బారెడ్డి - ఆనం వెంకటరెడ్డి - ఆనం సంజీవరెడ్డి - ఆనం రామనారాయణరెడ్డి.. ఇలా వీరి ఫ్యామిలీలో నలుగురు మంత్రులుగా పనిచేశారు. జిల్లా రాజకీయాలను వీరు శాసించేవారు. నాయకులు ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలని వీరే డిసైడ్‌ చేసేవారు. 2014 వరకు ఆనం ఫ్యామిలీ హవా సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఉన్న సమయంలో సీఎం రేసులో ఆనం రామనారాయణరెడ్డి ఉండేవాడు.

కానీ ఆ తరువాత పరిస్థితి మారింది. ఏపీలో కాంగ్రెస్‌ కోమాలోకి వెళ్లిపోవడంతో ఆనం ఫ్యామిలీ ప్రాభావం తగ్గింది. రాజకీయ మనుగడ కోసం టీడీపీలో చేరినా అక్కడా ఇమడలేకపోయారు. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎంతో మందికి టిక్కెట్లు ఇప్పించిన ఆనం బ్రదర్స్‌ టీడీపీలో కనీసం ఎమ్మెల్సీ కూడా దక్కించుకోలేకపోయారు. గతంలో తమ ముందు కూర్చోవడానికి కూడా భయపడిన వారి చేత వీరు అవమానాలు పడ్డారని చెబుతున్నారు. దీంతో అధికార టీడీపీని వీడి ప్రతిపక్ష వైసీపీలో చేరారు ఆనం రామనారాయణరెడ్డి. ఆత్మకూరు టికెట్‌ కోసం ప్రయత్నించి వీలుకాకపోవడంతో చివరికి వెంకటగిరి నుంచి పోటీకి రెడీ అవుతున్నారు.

ఆనం ఫ్యామిలీ తరువాత ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది నేదురుమల్లి ఫ్యామిలీ. 1978 నుంచి ఏపీలో తనకుంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి. మూడు దశాబ్దాల పాటు నెల్లూరు రాజకీయాలను శాసించారు. ఎమ్మెల్యే - ఎంపీ టిక్కెట్లు ఆశించేవారు నేదురుమల్లి ఇంటిముందు నిలబడే పరిస్థితి ఉండేది. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

2004 వరకు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన నేదురుమల్లి ఆ తరువాత డల్‌ అయిపోయారు. ఎందరికో టిక్కెట్లు ఇప్పించిన నేదురుమల్లి తాను చెప్పిన వారికి వెంకటగిరి టిక్కెట్‌ ఇప్పించుకోలేకపోయారు. నేదురుమల్లి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన కుమారుడు రాంకుమార్‌ రెడ్డి బీజేపీలో చేరారు. అందులో ఇమడలేని రాంకుమార్‌ రెడ్డి వైసీపీలోకి చేరారు. అయితే ఆయన పోటీ చేయడానికి నియోజకవర్గాలు ఖాళీ లేని పరిస్థితి ఎదురవుతోంది.

ఒకప్పుడు నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించిన ఆనం - నేదురుమల్లి ఫ్యామిలీలు ప్రస్తుతం ఈస్థాయిలో ఉండడంపై జిల్లాలో చర్చనీయాంశమైంది..