Begin typing your search above and press return to search.

నేను అయిదేళ్ల ఎమ్మెల్యేని...మధ్యలో ఆయనెవడు...?

By:  Tupaki Desk   |   29 Dec 2022 12:03 PM GMT
నేను అయిదేళ్ల ఎమ్మెల్యేని...మధ్యలో ఆయనెవడు...?
X
అవును కదా. మంట పుడుతుంది కదా. అది న్యాయం కూడా. ఇపుడు నెల్లూరు సీనియర్ నేత మాజీ మంత్రి ఆనం రాం నారాయణరెడ్డికి అదే మంట పుడుతోంది. ఆయన వెంకటగిరి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే. ఆయన పదవీకాలం అక్షరాలా పదిహేను నెలలు దాటి ఉంది. కానీ మధ్యలో మరోకాయన వచ్చి నేనే ఎమ్మెల్యే అంటున్నారుట. మరి ఆనం వారికి ఎలాగుంటుంది.

అందుకే నిన్నటికి నిన్న వైసీపీ ప్రభుత్వం మీద డైరెక్ట్ గా బాంబులు పెల్చిన ఆనం ఇపుడు వెంకటగిరి నియోజకవర్గం రాజకీయం మీద సెగలూ పొగలూ కక్కేశారు. తాను గడప గడపకూ ఎమ్మెల్యేగా వెళ్తూ ప్రజా సమస్యల గురించి తెలుసుకుంటూ ఉంటే మధ్యలో మరోకాయన వేలూ కాలూ పెట్టేస్తున్నారు అని నిప్పులు చెరిగారు. ఆయన ఎవరో కాదు నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడే రాం కుమార్ రెడ్డి. ఆయన నిజానికి 2019 ఎన్నికల్లోనే వైసీపీ టికెట్ అడిగారు.

అయితే నాడు జగన్ ఆనం కి టికెట్ ఇచ్చారు. రాం కుమర్ రెడ్డి పార్టీలో అలా ఉంటూ వస్తున్నారు. ఇక రెండు సార్లు మంత్రి పదవి కోసం ఎదురుచూసి ఇక రాదని తేల్చేసుకున్నాక ఆనం వారు తన టోన్ మార్చేశారు. ఆయన డేరింగ్ అండ్ డేషింగ్ గా పెన్షన్లకు ఎవరు ఓటేస్తారు అంటూ జగన్ సర్కార్ డొల్లతనాన్ని బయటపెట్టారు. ఒక వైపు దాని మీద హాట్ హాట్ డిస్కషన్ సాగుతుండంగానే వెంకటగిరిలో ఒకే పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయ భాగోతాన్ని బయటేసి అటు అధినాయకత్వానికి ఇటు రాం కుమార్ రెడ్డికి గట్టి ఝలక్ ఇచ్చారు.

నేను గడప గడపకు ఎమ్మెల్యేగా వెళ్తున్నా. వెంకటరిగి జనం అయిదేళ్ళకు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నా పదవీ కాలం ఇంకా ఉంది. మధ్యలో ఒకాయన నేనే ఎమ్మెల్యే అంటూ తిరగడమేంటి అని ఆనం గుస్సా అవౌతుననరు. ఇదంతా చూస్తూంటే నా సీటుకే ఎసరు పెడుతున్నారు అని ఆయన అంటున్నారు. తానే ఎమ్మెల్యే అని ఒక పెద్ద మనిషి చెప్పుకుని తిరగడమేంటి ఇదేమైనా మర్యాదా బాగుందా అని ఆనం నిలదీస్తున్నారు.

ఇవన్నీ చూస్తూంటే తాను ఎమ్మెల్యే కానా లేక కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ అధినాయకత్వం ఖరారు చేసిందా అని క్యాడర్ కూడా తనను అడుగుతున్నారని ఆనం మండిపడ్డారు. తన నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యేగా తనకు సమస్యలు చెబుతారా లేక దారిన పోయే దానయ్యకు చెబుతారా అని రాం కుమార్ రెడ్డి మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేశారు.

ఎవరు కాదన్నా మరెవరు తొందరపడ్డా తానే అయిదేళ్ళ ఎమ్మెల్యే అని ఆయన స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యే అంటూ ఆ పెద్ద మనిషి తొందరపడడం ఆపేయాలని ఆయన అన్నారు. ఒకసారి ఎన్నికలల్లోకి పోటీకి వచ్చి సగం ఎన్నికలలోనే వెనక్కి పారిపోయిన వ్యక్తా ఎమ్మెల్యే అవుతాను అంటోంది అని రాం కుమార్ రెడ్డి ఫ్లాష్ బ్యాక్ ని బయటకు తీసి మరీ విమర్శించారు.

కొంతమంది ఎమ్మెల్యే సీటు కోసం ఆశపడుతున్నారని, సీటు లాగేయాలని చూస్తున్నారని, అయితే ఇవన్నీ కుదరవు అంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా నేదురుమల్లి ఫ్యామిలీకి ఆనం కి ఎపుడూ రాజకీయంగా పడదు, ఆ విభేదాలు అలాగే ఉన్నాయి. ఇపుడు ఆనం వైసీపీకి రెబెల్ ఎమ్మెల్యేగా మారడంతో రాం కుమార్ రెడ్డిని హై కమాండ్ కావాలనే దించి మరీ ప్రోత్సహిస్తోంది అని అంటున్నారు. అయితే తానే ఎమ్మెల్యే అంటూ ఆనం గట్టిగా రిటార్ట్ ఇవ్వడంతో ఇపుడు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.