Begin typing your search above and press return to search.
తట్టా బుట్టా సర్దుకుంటున్న మాజీ మంత్రి
By: Tupaki Desk | 13 Nov 2015 12:38 PM GMTఏపీలో భూస్థాపితం అయ్యే స్టేజ్ లో ఉండి కునారిల్లుతున్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కు మరో సీనియర్ నేత, మాజీ మంత్రి గుడ్ బై చెపుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి - కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రఘువీరా చేస్తున్న యాత్ర కేవలం మట్టి యాత్రగా ఆయన కొట్టి పడేశారు. ప్రజల్లో ఆదరణ లేకుండా రఘువీరా ఎన్ని యాత్రలు చేసినా వేస్ట్ అని ఆయన తేలిగ్గా తీసిపడేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ రఘువీరారెడ్డి మట్టి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడిని ఎందుకు కలిశారో అయనకే తెలియదని ఆనం ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటున్న ఆనం బ్రదర్స్ కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆనం బ్రదర్స్ కు చెప్పకుండానే నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీని ప్రకటించడంతో అప్పట్లోనే ఈ బ్రదర్స్ రఘువీరాపై తమకు తెలియకుండానే జిల్లా కమిటీ ఎలా ఎంపిక చేస్తావంటూ రఘువీరాపై విరుచుకుపడ్డారు.
రఘువీరా నియమించిన జిల్లా కమిటీ సభ్యుల్లో ఒక్కడు పిలిచినా పదిమంది కూడా వాళ్ల వెంటరారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మరోసారి నేరుగా రఘువీరాను టార్గెట్ గా చేసుకుని రామనారాయణ రెడ్డి విమర్శంచడంతో ఆనం బ్రదర్స్ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేందుకు రెఢీ అయిపోతున్నారన్న వార్తలు నెల్లూరు జిల్లా పాలిటిక్స్ లో హాట్ హాట్ గా మారాయి. కాంగ్రెస్ పార్టీని వీడే ఆనం బ్రదర్స్ తమ జిల్లాకే చెందిన బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడితో టచ్ లో ఉంటున్నారని..ఆయన ద్వారా బీజేపీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఏదేమైనా వీరిద్దరు కాంగ్రెస్ ను వీడడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.