Begin typing your search above and press return to search.
రాజకీయంగా ఎదుర్కోలేక.. చంపేయాలని చూస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
By: Tupaki Desk | 1 Feb 2023 3:30 AM ISTవైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సీనియర్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీలో అడుగడుగునా అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. తనను చంపేయాలని ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు నక్సల్స్ నుంచి ప్రమాదం ఉందని తెలిసి కూడా సెక్యూరిటీ తగ్గించారని అన్నారు. తనకు నక్సల్స్ నుంచి ప్రమాదం ఉందన్న విషయం కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాలే.. డీజీపీకి చెప్పాయని తెలిపారు.
పైగా తాను.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేనని.. సెక్యూరిటీ తీసేస్తారా? అని మండి పడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందన్నారు. స్మగ్లర్లు, వారికి సహకరించే వారు ఇక్కడ ఉన్నారని అన్నారు. అలాంటి చోట తిరిగే తనకు రక్షణ ఉండదా? అని ప్రభుత్వాన్ని పరోక్షంగా ఆయన నిలదీశారు. ఇవన్నీ కూడా తనను రాజకీయంగా ఎదుర్కోలేక.. చంపేయాలనే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తనకు ప్రాణహాని తలపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తారా? అని ఆనం నిప్పులు చెరిగారు. తన ఫోన్స్ ట్యాప్ అవుతున్నాయన్నారు. `` నాకు రెండు ఫోన్లు ఉన్నాయి. గన్ మెన్ కి, పిఏకి ఫోన్ లు ఉన్నాయి. నా ఫోన్, మా పిఏ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారు. రెండేళ్లుగా మా ఫోన్లు ట్యాప్ చేశారు. వాట్స్ యాప్, ఫేస్ టైమ్ యాప్ లో మాట్లాడాల్సి వస్తోంది. చివరికి నా బిడ్డలతో కూడా నేను ఇలానే మాట్లాడాల్సి వస్తోంది. ట్యాప్ చేసేదే మా వాళ్ళు, ఇంక నేనెవ్వరికి ఫిర్యాదు చేయాలి. నా దగ్గర కోకొల్లలుగా సాక్ష్యాలు ఉన్నాయి`` అని ఆనం తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.