Begin typing your search above and press return to search.

ఆనం లాజిక్‌!..టీడీపీకి స్పందించే ద‌మ్ముందా?

By:  Tupaki Desk   |   6 Nov 2018 10:15 AM GMT
ఆనం లాజిక్‌!..టీడీపీకి స్పందించే ద‌మ్ముందా?
X
తెలుగు నేల రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాల‌కు కొద‌వేమీ లేకుండా పోయింది. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తెలంగాణ‌లో కంటే కూడా మ‌రో 7 నెల‌ల త‌ర్వాత ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఏపీలోనే ఈ త‌ర‌హా సంచ‌ల‌నాలు న‌మోద‌వుతుండ‌టం నిజంగా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌క మాన‌దు. 2019 ఎన్నిక‌ల్లో మ‌రోమారు తాను అధికార ప‌గ్గాలు చేప‌ట్టేందుకు ఇప్ప‌టి నుంచే ప‌క్కాగా ప‌థ‌కం ర‌చించుకుంటున్న చంద్ర‌బాబు... ఏ పార్టీకి అయితే వ్య‌తిరేకంగా టీడీపీని స్వ‌ర్గీయ ఎన్టీఆర్ స్థాపించారో - ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పొట్టేసుకున్నారు. జ‌నం ఛీకొడ‌తార‌న్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్ర‌బాబు ఈ త‌ర‌హా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. బాబు తీసుకుంటున్న ఈ త‌ర‌హా నిర్ణ‌యాల‌పై లాజిక‌ల్ ప్ర‌శ్న‌లు సంధించి ఆయ‌న‌తో పాటు టీడీపీ శ్రేణుల‌ను ఇబ్బందుల పాల్జేసే గ‌ళాలు ఇప్పుడు ఏపీలో పెద్ద‌గా లేవ‌నే చెప్పాలి. విప‌క్ష నేత హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... ఈ త‌ర‌హా సంచ‌ల‌నాల‌పై త‌న‌దైన మార్కు విమ‌ర్శ‌లు చేస్తున్నా కూడా... జ‌గ‌న్ మిన‌హా మ‌రో నిర‌స‌న గ‌ళం వినిపించ‌డం లేదు. అయితే ఈ లోటును తీర్చేందుకా అన్న‌ట్టుగా కాసేప‌టి క్రితం ఈ గ‌ళం... అది కూడా విప‌క్ష వైసీపీ నుంచే కాస్తంత గ‌ట్టిగానే గ‌ర్జించింది. ఆ గ‌ళం మ‌రెవ‌రిదో కాదు.... నిన్న‌టిదాకా చంద్ర‌బాబును కీర్తించి - ఇటీవలే చంద్ర‌బాబు మార్కు రాజ‌కీయాల‌కు విసిగి వేసారి... వైసీపీలోకి చేరిన మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌రణ రెడ్డి.

ఇక అస‌లు విష‌యంలోకి వెళితే.... విశాఖ ఎయిర్ పోర్టులో జ‌గ‌న్‌ పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై సోష‌ల్ మీడియాలో క‌నిపిస్తున్న ఓ విష‌యాన్ని ప్ర‌స్తావించిన వైసీపీ నేత జోగి ర‌మేశ్ కు గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల‌కు స్పందించిన ర‌మేశ్... నేరుగా పోలీస్ స్టేష‌న్ దాకా వెళ్లారు. పోలీస్ స్టేష‌న్‌ లో ఏం జ‌రుగుంద‌న్న విష‌యం ప‌క్క‌న‌పెడితే... ర‌మేశ్ అటు పోలీస్ స్టేష‌న్ బాట ప‌ట్టగానే... బాబు పాల‌న‌లో విప‌క్షాల‌పై జ‌రుగుతున్న అకృత్యాల‌పై గ‌ళం విప్పేందుకు రామ‌నారాయ‌ణ రెడ్డి మీడియా ముందుకు వ‌చ్చారు. బాబు పాల‌న‌లో అస‌లు ఏం జ‌రుగుతుంది అన్న అంశాన్ని ప్ర‌స్తావించిన ఆనం... బాబు మార్కు పాల‌న‌పై త‌న‌దైన శైలి విమ‌ర్శ‌నాస్త్రాల‌ను సంధించారు. త‌మ పార్టీకి చెందిన అధినేత‌పై దాడి జ‌రిగితే... ఆ దాడికి సూత్ర‌ధారులెవ‌ర‌న్న విష‌యాన్ని తేల్చాల్సిన ప‌నిని ప‌క్క‌న ప‌డేసిన పోలీసు యంత్రాంగం... ఆ దాడిపై సోష‌ల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ పోస్ట్ ను ప్ర‌స్తావించిన త‌మ పార్టీ నేత‌కు నోటీసులిచ్చింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అయినా జ‌గ‌న్‌ పై దాడి ఆప‌రేష‌న్ గ‌రుడ‌లో భాగంగానే జ‌రిగింద‌ని న‌టుడు - టీడీపీ అనుకూల స్టాండ్‌ తో చెల‌రేగిపోతున్న శివాజీని ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని కూడా ఆనం కాస్తంత మంచి లాజిక్ ప్ర‌శ్న సంధించారు. టీడీపీకి అనుకూలంగా ఉంటూ ఏం చేసినా ఈ పోలీసులు ప‌ట్టించుకోర‌ని - అదే స‌మ‌యంలో టీడీపీకి వ్య‌తిరేకంగా ఉంటే... అకార‌ణంగానూ అరెస్ట్ లు జ‌రిగిపోతాయంటూ కూడా ఆనం బాబు పాల‌న‌పై నిప్పులు చెరిగారు. అస‌లు రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి అధిప‌తిగా ఉన్న డీజీపీ ఆర్పీ ఠాకూర్ చేస్తున్న డ్యూటీ ఏమిటో చెప్పాల‌ని కూడా ఆనం ప్ర‌శ్నించారు. ఈ త‌ర‌హా లాజిక్ ప్ర‌శ్న‌లు ఇప్ప‌టిదాకా టీడీపీకి ఎదురు కాలేద‌నే చెప్పాలి. ఒక‌వేళ అడ‌పా ద‌డ‌పా ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లు ఎదురైనా టీడీపీ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అయితే ఇప్పుడు జోగి ర‌మేశ్ కు నోటీసుల నేప‌థ్యంలో స్పాంటేనియ‌స్‌ గా స్పందించిన ఆనం... నిజంగానే టీడీపీని ఇర‌కాటంలో ప‌డేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలుగు నేల రాజ‌కీయాల్లో సీనియ‌ర్ రాజ‌కీయవేత్త‌గా పేరున్న ఆనం ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ స‌ర్కారు స్పందించ త‌ప్ప‌ని ప‌రిస్థితి కూడా ఉంద‌న్న వాద‌నా వినిపిస్తోంది. మ‌రి ఆనం సంధించిన ప్ర‌శ్న‌ల‌కు బాబు అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.