Begin typing your search above and press return to search.

ఆనం అడ్డం తిరిగితే అంతే...?

By:  Tupaki Desk   |   30 Oct 2021 12:30 PM GMT
ఆనం అడ్డం తిరిగితే అంతే...?
X
ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ పొలిటికల్ ఫ్యామిలీ ఆనం వారిది. వర్తమానంలో ఆ ఫ్యామిలీ తరఫున ఆనం రామ‌నారాయణరెడ్డి నెల్లూరు జిల్లాలో ఫోకాస్డ్ గా రాజకీయం చేస్తున్నారు. ఆయన వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో గెలిచారు. ఆనం రామనారాయణరెడ్డి లాంటి సీనియర్ కి జగన్ తన క్యాబినెట్ లో చోటు ఇవ్వలేదు. దాంతో ఆయన వర్గం అగ్గి మీద గుగ్గిలం అవుతూ వస్తోంది. మరో వైపు నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, మేకపాటి గౌతం రెడ్డి సైతం ఆనం వర్గాన్ని అణచేస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో చాలా సార్లు నెల్లూరు పెద్దాయన తన అసంతృప్తి అన్నది వెళ్లగక్కారు. ఆ మధ్యన జగన్ ఆయన్ని పిలిచి మాట్లాడారు కూడా. ఇక తాజాగా ఆనం మరో మారు అధికారుల మీద విమర్శలు చేశారు. వెంకటగిరి నియోజకవర్గంలో అధికారులకు వ్యతిరేకంగా ఆయన ఆందోళనకు పిలుపు ఇవ్వడం అధికార వైసీపీని ఇరుకున పెట్టినట్లు అయింది.

ఇవనీ ఇలా ఉంటే రాష్ట్రంలో త్వరలో మూడు కార్పోరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో నెల్లూరు కూడా ఉంది. అక్కడ గెలుచుకోవాలంటే ఆనం రామ నారాయణరెడ్డి మద్దతు తప్పనిసరి. అయితే వైసీపీ సర్కార్ పెద్దల వైఖరితో తరచూ గుస్సా అవుతున్నా ఆనం ఎంత మేరకు సహకరిస్తారు అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్నగా ఉంది. ఆనం కనుక అడ్డం తిరిగితే నెల్లూరులో ఫలితం కంప్లీట్ గా తేడా కొడుతుంది అనే అంటున్నారు. ఎందుకంటే నెల్లూరు కార్పోరేషన్ పరిధిలో టీడీపీ బలంగా ఉంది. లోకల్ బాడీ ఎన్నికల్లో జబ్బ చరిచామని చెబుతున్న వైసీపీకి నెల్లూరు కార్పోరేషన్ గెలుచుకోవడం చాలా అవసరం. పైగా అంతటా ఏకపక్ష విజయాలు అని సౌండ్ చేస్తున్న వైసీపీ నెల్లూరులో బొక్క బొర్లా పడితే మాత్రం సీన్ సితారే అవుతుంది.

ఈ నేపధ్యంలో ఆనం రామ నారాయణరెడ్డిని పిలిచి వైసీపీ హై కమాండ్ మాట్లాడుతుంది అంటున్నారు. ఆయన సహకారం పూర్తిగా ఉండాలని కూడా కోరుతుంది అనే చెబుతున్నారు. ఆనం రామ నారాయణరెడ్డి చేయి వేస్తేనే నెల్లూరు లో వైసీపీ పరువు నిలిచేది అంటున్నారు. మరి ఆనం మాట ఇస్తారా. వైసీపీ హై కమాండ్ సూచనల మేరకు ఆయన మనస్పూర్తిగా పనిచేస్తారా. ఇవన్నీ ప్రశ్నలే. ఆనం కనుక జోక్యం చేసుకోకపోతే మాత్రం ఫ్యాన్ పార్టీకి సింహపురిలో ఊపిరాడదనే అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.