Begin typing your search above and press return to search.

జగన్ గురించి ఎంత దిగజారి మాట్లాడాడంటే..

By:  Tupaki Desk   |   3 May 2017 10:05 AM GMT
జగన్ గురించి ఎంత దిగజారి మాట్లాడాడంటే..
X
రాజకీయ నాయకుల్ని సినిమాల్లోని పాత్రలతో పోల్చడం మామూలే. ఐతే ఆ పోలిక తెచ్చేటపుడు కాస్తయినా విజ్నతతో వ్యవహరించడం అవసరం. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం ఎంతమాత్రం సమంజసంగా అనిపించదు. సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా సినిమా పోలికలు పెడితే జనాలకు మండుతుంది. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే.. తెలుగుదేశం నాయకుడు ఆనం వివేకానందరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఇలాగే ఉన్నాయి. తమ అధినేతను ఆకట్టుకునేందుకు ప్రతిపక్ష నేత జగన్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు ఆనం బ్రదర్.

గిట్టుబాటు ధర దక్కక తీవ్ర నష్టాల పాలవుతున్న మిర్చి రైతుల కోసం జగన్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే మిర్చి రైతుల కోసం జగన్ దీక్ష అనగానే.. గుంటూరు మిర్చి యార్డు నేపథ్యంలో సాగే ‘ఒంగోలు గిత్త’ సినిమా గుర్తుకొచ్చేసింది వివేకాకు. అంతే ఆ సినిమాలో విలన్ అయిన ప్రకాష్ రాజ్ తో జగన్ కు పోలిక పెట్టేశాడు ఆనం. అందులో ప్రకాష్ రాజ్ లాగే జగన్ కూడా జనాల ముందు మంచి వాడిగా నటిస్తూ.. తెర వెనుక మాత్రం తప్పుడు పనులు చేస్తుంటాడని ఆనం అన్నాడు. ఇంట్లో జగన్ చొక్కా విప్పేసి మద్యం తాగుతాడని అన్నాడు ఆనం. ఓవైపు మిర్చి రైతుల కడుపు మంటతో రగిలిపోతుంటే.. ఆనం ఇలా సినిమా పోలికలతో సెటైర్లు వేయడం.. సెన్సిటివ్ ఇష్యూ మీద ఇలా స్పందించడం.. నోటికొచ్చినట్లు పర్సనల్ కామెంట్స్ చేయడం ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ ప్రకాష్ రాజ్ అయితే.. మీరు ఎలాంటి విలన్ అంటూ ఆనంకు ప్రశ్నలు సంధిస్తున్నారు జనాలు. ఆయన్ని కామెడీ విలన్లతో పోలుస్తున్నారు.

జగన్ చిన్న పిల్లవాడని.. తను మిరపకాయి అంటేనే తెలియదని కూడా ఆనం వ్యాఖ్యానించాడు. మరి అన్నీ తెలిసిన ఆనం.. తెలుగుదేశం నేతలు మిర్చి రైతులలా గగ్గోలు పెడుతుంటే ఏం చేస్తున్నారో మరి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో ఉండి.. నిండా మునిగాక ఎమ్మెల్సీ.. మంత్రి పదవులు ఆశించి తెలుగుదేశంలోకి వచ్చారు ఆనం బ్రదర్స్. ఒకప్పుడు వైఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆనం బ్రదర్స్.. అధికారానికి దూరమై పార్టీ మారగానే జగన్ గురించి ఇలా మాట్లాడటం విడ్డూరమే.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/