Begin typing your search above and press return to search.

ఆనం అన్న మాటలన్నీ జగన్ వింటే..?

By:  Tupaki Desk   |   5 Jun 2016 9:32 AM GMT
ఆనం అన్న మాటలన్నీ జగన్ వింటే..?
X
కొంతమంది నేతల తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. మిగిలిన వారు చేసే విమర్శలకు వారి విమర్శలకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువ. తీవ్రత పాళ్లకు సంబంధం ఉండదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలంటూ విపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలు సృష్టించిన కలకలం ఎంతన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ అంశం మీద టీడీపీ తమ్ముళ్లు రియాక్ట్ అయ్యారు. కానీ.. వీరందరి మాటలు ఒక ఎత్తు.. ఇటీవలే టీడీపీ తీర్థం పుచ్చుకొని పచ్చ కండువా మెడలో వేసుకున్న ఆనం వివేకానందరెడ్డి మాటలు మరో ఎత్తుగా చెప్పాలి.

‘చెప్పు’ ఎపిసోడ్ మీద ఆనం వారి మాటల్ని జగన్ వింటే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అన్న భావన వెనువెంటనే కలగటం ఖాయం. ఇంతకీ.. జగన్ మీద ఆనం ఎంత ఫైర్ అయ్యారన్నది చూస్తే..

ముఖ్యమంత్రి చంద్రబాబును చెప్పుతో కొట్టాలన్న జగన్ ను ఆయన పిచ్చి కుక్కతో పోల్చటంతో పాటు జైలుకు వెళ్లాలంటూ మండిపడ్డారు.పిచ్చికుక్క ఊరి మీదకు వెళితే ఎలా ఉంటుందో.. జగన్ సైతం అదే తీరులో ప్రవర్తిస్తున్నట్లు సీరియస్ అయిన ఆయన..జగన్ చర్యల్ని రాష్ట్రం తట్టుకోలేకపోతుందని.. రాష్ట్ర ప్రజల తరఫున తాను ఆయన్ని జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.

జగన్ ప్రవర్తనతో రెడ్డకు.. తెలుగు వారికి చెడ్డపేరు వస్తుందంటూ కులాన్ని తెచ్చిన ఆనం.. పనిలో పనిగా విజయమ్మను కూడా తీసుకొచ్చేశారు. జగన్ ను జిల్లేడు పాలతో పోసి పెంచినందు వల్లే ఆయన విష సర్పం అంటూ ఫైర్ అయిన ఆనం.. గనులు.. భూముల్ని దోచుకున్న వారినే జగన్ ప్రోత్సాహిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డికి రాజ్యసభ టిక్కెట్టు ఇవ్వటమే నిదర్శనంగా చెప్పిన ఆనం.. అవకాశం ఉండాలే కానీ కేసుల్లో నిందితుడిగా ఉన్న మూడో వ్యక్తిని ఐక్యరాజ్య సమితికి కూడా పంపేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లుగా మండిపడ్డారు. ఆనం వారి ఫైరింగ్ ను జగన్ విని ఉంటారా?