Begin typing your search above and press return to search.
తల్లిని చెల్లిని బలి చేశారంటూ జగన్ ను ఏసుకున్నాడు
By: Tupaki Desk | 17 Jun 2016 7:54 AM GMTఏ పార్టీలో ఉన్నా కొందరి నేతల ఐడెంటిటీ కాస్త వేరుగా ఉంటుంది. తమదైన స్టైల్ తో ఉండటమే కాదు.. పార్టీలకు అతీతంగా వారి వ్యాఖ్యలు ఉంటాయి. ఉన్న పార్టీని వదిలేసి.. మిగిలిన వారిని దుమ్మెత్తిపోసే వారి మాటలు కొన్ని అభ్యంతరకరంగా ఉంటాయి కూడా. అలాంటి తరహా నేతల్లో నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఒకరు. తనదైన వైఖరితో తరచూ వివాదాల్లోనూ.. వార్తల్లోఉండే ఆయన తాజాగా ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు.
గడిచిన కొద్ది రోజులుగా టీడీపీ తమ్ముళ్లకు.. జగన్ పార్టీ నేతలకు మధ్య సాగుతున్న మాటల యుద్ధాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాలా వివేక మాటలు ఉన్నాయి. ఆయన మాట్లాడిన మాటల్లో చాలావరకూ సెన్సార్ చేయాల్సినవేనని చెప్పక తప్పదు. నాటకీయంగా మాట్లాడే ఆయన అందుకు తగ్గట్లుగా హావభావాల్ని కలగలిపి జగన్ మీద తీవ్ర విమర్శలే చేశారు. తన రాజకీయ ప్రయోజనం కోసం జగన్ తన తల్లి విజయమ్మను విశాఖలో పోటీకి పెట్టి బలిపశువును చేశారన్నారు. అదే విధంగా చెల్లి షర్మిలను ఇబ్బందికి గురి చేశారన్నారు.
జగన్ కు కుటుంబ సభ్యుల నుంచి బంధువులు.. స్నేహితులు.. ఎవరూ అక్కర్లేదని.. ఆయనకు కేవలం డబ్బు మీద మాత్రమే ధ్యాస ఉంటుందన్నారు. జగన్ ను ఒక మానసిక రోగిగా అభివర్ణించిన ఆనం వివేక.. ఎప్పుడూ మనది అన్న భావన ఉండదని నాది అన్న భావనే ఎక్కువని చెప్పారు.
జగన్ అహంకార ధోరణి వల్లే ఆ పార్టీ నేతలు అసహ్యించుకొని తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారన్నారు. హెలికాఫ్టర్ ప్రమాదంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ మరణించారే కానీ.. లేకుంటే జగన్ కారణంగా ఆయన చాలానే ఇబ్బందులకు గురయ్యే వారంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుగా పెట్టుకొని లక్ష కోట్ల రూపాయిలు దోచుకున్న జగన్.. తాను ముఖ్యమంత్రి కావటం ద్వారా మరిన్ని కోట్లాది రూపాయిల్ని దోచుకోవాలని భావిస్తున్నట్లుగా వ్యాఖ్యానించారు. మంట పుట్టించేలా ఉన్న వివేక మాటలపై జగన్ పార్టీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యేందుకు సాహసిస్తారా? చూస్తూ.. చూస్తూ ఆనం వివేక నోటి మాటలకు కౌంటర్ ఇచ్చే సాహసం చేస్తారంటారా..?