Begin typing your search above and press return to search.
శృంగారంపై ఆనం వివేకా స్పందన!
By: Tupaki Desk | 25 July 2016 4:32 AM GMTరాజకీయ నాయకుల్లో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. రకరకాల డ్రెస్సులతో చిత్రవిచిత్రంగా కనిపిస్తుంటారు, బహిరంగంగా పొగతాగుతుంటారు, చీర సింగారించుకుంటారు, దేవాలయాల్లో కీర్తనలు పాడతారు, మైకు పట్టుకుంటే టీవీ చానళ్లు లైవ్ ఇచ్చే సాహసం చేయలేని స్థాయిలో ప్రత్యర్ధులపై విరుచుకుపడతారు... ఈ మాత్రం ఇంట్రడక్షన్ చాలు కదా ఆయన ఎవరో తెలుసుకోవడానికి. ఎస్.. యు ఆర్ కరెక్ట.. ఆయనే నెల్లూరు జిల్లా రాజకీయ నాయకుడు - టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి!
తన వేషదారణ - తన చిత్రవిచిత్రాలపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన ఆనం వివేకా... తన కొత్త కొత్త గెటప్పుల వెనక ప్రత్యేకమైన కారణాలేమీ లేవని చెప్పుకొచ్చారు. తనకు నచ్చినట్లుగా తాను జీవిస్తానని, ఒకరు చెప్పినట్లుగా తాను చెయ్యనని - బొడ్లో తాళాలు పెట్టుకోవడం - కిర్రు చెప్పులు వేసుకోవడం చేస్తుంటానని అన్నారు. ఇదే క్రమంలో సింగార - శృంగారాలపై ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు వివేకా!
తన సింగారాలు చూసి తానేదో శృంగార పురుషుడిని అని అనుకోవద్దని.. తాను కేవలం సింగారాలు మాత్రమే చేస్తాను తప్ప శృంగారాల జోలికి పోనని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో జనంతో ఉండటం, వారితో కలిసి తిరిగడం ఇష్టమని చెప్పిన వికేకా తన వయసు తనకు గుర్తురాకుండా ఉండటానికి తన మనవళ్లు తనను వివేకా అని పిలిచినట్లుగానే, తన కుమారులు కూడా పిలిస్తే హ్యాపీగా ఉంటానై తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా... ఆనం స్టైలే వేరబ్బా అంటున్నారు అభిమానులు!!