Begin typing your search above and press return to search.
ఆనం వివేకా...! అది నాలుకా?
By: Tupaki Desk | 28 Nov 2015 9:42 AM GMTఅంతరించిపోతున్న కళలు - ఆటలకు కొందరు రాజకీయ నాయకులు ప్రాణం పోస్తున్నారనిపిస్తోంది... నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి వంటి నేతలు అలాంటి వారిలో ఒకరని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈకాలం యువతకు కానీ, ఇప్పుడున్నవారిలో చాలామందికి పిల్లిమొగ్గలు అన్నవి వినడమే తప్ప ఎలా వేస్తారో తెలియని పరిస్థితి. అలాంటివారు ఆనం వివేకా వద్దకు వెళ్తే పిల్లిమొగ్గలు నేర్చుకోవచ్చని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు. అందుకు తాజా రాజకీయ పరిణామాలను ఉదహరిస్తున్నారు. కాంగ్రెస్ ను తల్లి కంటే ఎక్కువని చెప్పిన వివేకా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారని... అలాంటి వివేకా ఇప్పుడు కాంగ్రెస్ ను తిడుతూ చంద్రబాబుకు భజన చేస్తున్నారని ఆనం బ్రదర్స్ వ్యతిరేకులు చెబుతున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి మాటల్లో కొంత సంయమనం పాటించినా వివేకాకు అదేమీ ఉండదు. ఆయనకు మైకు దొరికినా, ఎదురుగా నలుగురు కనిపించినా విజృంభిస్తారు. ఎవరినైనా తిట్టాలన్నా, ఎవరిపైనైనా అభిమానం చూపించాలన్నా దాన్ని హైరేంజిలోనే చూపిస్తారు. అలాంటి వివేకా గతంలో చంద్రబాబును దారుణంగా తిట్టారు. అనేకానేక ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ తల్లిలాంటిదని... ఆ తల్లిని తాము ఎన్నడూ మర్చిపోమని అమ్మ పట్ల భక్తిని కూడా చాటుకున్నారు.
పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని... కాంగ్రెస్ తల్లి ఆఖరు రక్తపు చుక్క కూడా తాగి ఆ తల్లికే ద్రోహం చేయడం అన్యాయమంటూ అంతకుముందు కాంగ్రెస్ ను వీడినవారిని వివేకా తిట్టిపోశారు. అలాంటివారు పోతే కొత్తవారు వస్తారని.. కాంగ్రెస్ కోసం నాయకులు పుడతారని అన్నారు. అలాంటివారిని చంద్రబాబు చేర్చుకోవడంపైనా ఆయన మండిపడ్డారు. చంద్రబాబును మోసకారి అని.. నమ్మకద్రోహి అని మండిపడ్డారు. చంద్రబాబు 16 కుంభకోణాల్లో ఉన్న దౌర్భాగ్యుడు, గుంటనక్క అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించిన సందర్భాలూ ఉన్నాయి. చంద్రబాబు వంద రోజుల పాలనపైనా వంద అబద్ధాల పాలనంటూ వివేకా విరుచుకుపడిన సందర్భాలున్నాయి. ఇక రాంనారాయణరెడ్డి కూడా ఇసుక రవాణాపై ఎన్నో ఆరోపణలు చేశారు.
అయితే... రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మితృత్వం ఉండదన్న సత్యన్ని మరోసారి రుజువుచేస్తూ.. వివేకా వంటి రాజకీయ నాయకులకు నాలుక ఉండదని, తాటిపట్టే ఉంటుందని ఇంకోసారి నిరూపిస్తూ ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. అంతే.... ఒక్కసారిగా వారి స్వరమే మారిపోయింది. చంద్రబాబు ఇప్పుడు వారికి అపర పాలనా దక్షుడు. కాంగ్రెస్ చెల్లని కాసు. ఇది వాస్తవమే కావొచ్చు... కానీ, ఈ వాస్తవం ఆనం సోదరుల వంటి వారి నోటి వెంట రావడమే ఇప్పుడు చర్చనీయాంశం. భవిష్యత్తులో వీరి నాలుకలు మళ్లీ ఏం మాట్లాడుతాయో, ఎటు తిరుగుతాయో చూడాలి.