Begin typing your search above and press return to search.
ఆనం వివేకాకు ఏమైంది...?
By: Tupaki Desk | 5 July 2017 7:03 AM GMTరాజకీయాల్లో హుషారు - చతురతు మారుపేరైన టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఆయన కొంతకాలం పాటు మీడియాకు కనిపించకపోవడంతో వైద్యం కోసం వెళ్లారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నారని సమాచారం.
ఆనం వివేకా ఆ మధ్య రోజాను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయగా రోజా పరువునష్టం దావా వేశారు. విచారణలో భాగంగా కోర్టు ఆనంను కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. తాను క్యాన్సర్ తో బాధపడుతున్నానని, కండిషన్ సీరియస్ గా ఉందని.. కోర్టుకు రాలేనని ఆయన తెలియజేసినట్లు సమాచారం.
కాగా ఆనం వివేకా తన అనారోగ్యం - వైద్యానికి సంబంధించిన పత్రాలను కూడా కోర్టుకు సమర్పించారట. రోజా ఈ విషయం ఇటీవల వెల్లడించడంతో ఆనం అనారోగ్యానికి సంబంధించిన సమాచారం బయటకు రావడంతో ఆయన అభిమానులు - నెల్లూరు నేతలు ఆందోళన చెందుతున్నారు. నిత్యం సరదాగా ఉండే వివేకా ఆరోగ్యం కుదుపటడాలని అంతా కోరుకుంటున్నారు.కాగా రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా నిత్యం యాక్టివ్ గా ఉండే చాలాకాలంగా చురుగ్గా లేరు. అందుకు టీడీపీలో పరిస్థితులు ఒక కారణమైతే అనారోగ్యం కూడా మరో కారణమని అంటున్నారు.