Begin typing your search above and press return to search.
ఆనం వివేకా 'సినిమా కష్టాలు'
By: Tupaki Desk | 27 Jan 2016 5:30 PM GMT కాంగ్రెస్ నుంచి ఇటీవలే టీడీపీలోకి చేరిన ఆనం వివేకానందరెడ్డి ఇప్పుడు నెల్లూరు పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారారు. కొందరు ఆయన్ను పొలిటికల్ హీరో అంటుంటే ఇంకొందరు మాత్రం పొలిటికల్ కమెడియన్ అంటున్నారు. సినిమాల్లో నటించాలని బాగా కండూతి ఉన్న వివేకా కోరిక తీరుతుందా లేదా అన్న చర్చ కూడా నెల్లూరులో జరుగుతోంది. ఇందుకు గత, తాజా పరిణామాలను ముడివేసి ఆయన అభిమానులు, వ్యతిరేకులు రకరకాలుగా చెప్పుకొంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమాలో ఆయన నటిస్తారని అంటున్నారు.
సోగ్గాడిలా కనిపించే వివేకాను సినిమాల్లో నటించాలన్న కోరిక బాగా ఎక్కువట. కాంగ్రెస్ మీటింగు సందర్బంగా ఓసారి చిరంజీవి చెవిలో తన కోరిక వినిపించగా ఆయన తన 150వ సినిమాలో ఛాన్సు ఇప్పిస్తానని చెప్పారట. కానీ, చిరంజీవి 150వ సినిమాకు 150 కష్టాలు ఎదురై అది పట్టాలకెక్కడం లేదు. ఈలోగా వివేకా టీడీపీలోకి వచ్చేశారు. దీంతో ఈసారి ఆయన బాలకృష్ణను కాంటాక్ట్ చేస్తారని... బాలయ్య 100వ సినిమాలో ఆయన నటిస్తారని అనుకుంటున్నారు.
అయితే.. ఎప్పటినుంచో సినిమాల్లో నటించాలని తహతహలాడుతున్న వివేకా ఆమధ్య తన కోరిక తీర్చుకునే ప్రయత్నం చేశారు. ఆ మధ్యలో నెల్లూరుకి చెందిన నిజాముద్దీన్ అనే ఔత్సాహిక నిర్మాత ఆనం వివేకాతో సినిమా తీయాలని భావించారు. అందుకు ఆయనని ఒప్పించారు. సదరు సినిమాలో వివేకాది జస్టిస్ పాత్ర. తమిళహీరోలు - ఓ ప్రముఖ హీరోయిన్ కాల్ షీట్లు కూడా బుక్ చేశారు. నెల్లూరులోని వి.ఆర్. బి.ఇ.డి కాలేజీ భవనంలో సెట్ వేశారు. ఆ సినిమాలో వివేకాపై ఓ సాంగ్ కూడా పెట్టాలనుకున్నారు. ఆ పాటతోపాటు మరో నాలుగు పాటల రికార్డింగ్ పనులు కూడా పూర్తిచేశారు. ఆర్టిస్టులు కొందరికి రెమ్యునిరేషన్ లో కొంతభాగం చెల్లించారు. మరికొందరికి ఖరీదైన కానుకలు ఇచ్చారు. సినిమాకి "క్షమాపణ'' అన్న టైటిల్ ని ఖరారుచేశారు. అయితే... వివేకా సన్నిహితులు కొందరు "ఇదేమిటి బాస్! మీరు క్షమాపణ అన్న సినిమాలో నటించడమేంటి? మీరేదో జనానికి క్షమాపణ చెప్పినట్టుగా ఉంది..'' అంటూ కామెంట్ చేశారట! దీంతో వివేకా ఆ సినిమాకు తూచ్ చెప్పేశారట. పాపం అప్పటికే ఓ ముప్పై లక్షల వరకు చేతి చమురు వదిలించుకుని నట్టేట మునిగిపోయాడు
అయితే... ఆనం వివేకా ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పుడు గెటప్ కూడా మార్చేశారు. సింహా చిత్రంలో బాలకృష్ణ స్టయిల్లో కనిపిస్తున్నారు. దీంతో వివేకా బాలకృష్ణను ఆశ్రయించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అయితే... వివేకాతో ఢీ అంటే ఢీ అనే సినీ నిర్మాత, దక్షిణభారత చలనచిత్ర నిర్మాతల సంఘం అధ్యక్షుడు - నెల్లూరు వాసి సి.కల్యాణ్ మాత్రం వివేకా కలలను నిజం చేయకుండా అడ్డుకుంటారని అనుకుంటున్నారు. ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం ఉండడంతో గతంలో కళ్యాణ్ - వివేకాలు తిట్టుకున్నారు. అంతేకాదు.. నెల్లూరు టీడీపీలో వివేకా వ్యతిరేక బ్యాచంతా కళ్యాన్ దోస్తులట... దీంతో టీడీపీలోనైనా వివేకా తన సినిమా కల తీర్చుకుంటారా... లేదంటే దానికి కళ్యాణ్ అడ్డంపడతారా? అన్న చర్చ సాగుతోంది. మరోవైపు సినిమాలో నటించేవరకు తనకు చిన్ననాటి అలవాటైన 'ప్రతిరోజూ సెకండ్ షో" అలవాటును మాత్రం వివేకా నిరాటంకంగా కొనసాగిస్తున్నారట.