Begin typing your search above and press return to search.

దేశాన్ని ఆశ్చర్యపరచండి నిర్మలా: ఆనంద్ మహేంద్ర

By:  Tupaki Desk   |   14 Jan 2020 6:40 AM GMT
దేశాన్ని ఆశ్చర్యపరచండి నిర్మలా: ఆనంద్ మహేంద్ర
X
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశ జీడీపీ 4శాతం లోపే తచ్చాడుతోంది. ఆర్థిక మందగమనంతో దేశంలో కొనుగోలు శక్తి పడిపోయి ఆటోమొబైల్ కుదేలైంది. పరిశ్రమలు మూతపడి ఉద్యోగ అవకాశాలు పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రంలోని మోడీ సర్కారు విప్లవాత్మక చర్యలకు పూనుకుంది.

ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ కోసం ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా దేశంలోని వివిధ రంగా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలతో భేటి అయ్యింది. వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించింది.

ఈ నేపథ్యంలో మోడీ, నిర్మల భేటికి హాజరైన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 5శాతం ఉందని.. ఇంకా మనం చైనా కంటే వెనుకనే ఉందామా అని ట్వీట్ చేశారు. ఇంత మందగమనం నేపథ్యంలోనే పకడ్బందీగా ఉద్దీపన చర్యలతో అదిరిపోయే బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేయండని సీతారామన్ కు ఆనంద్ మహేంద్ర సూచించారు.

ఈ సందర్భంగా ఆనంద్ మహీంద్ర ‘బ్లూమ్ బర్గ్’ ట్వీట్ ను షేర్ చేశారు. చైనా 2019లో 6శాతం నుంచి 6.5శాతానికి వృద్ధి చెందిందని.. భారత్ 5శాతం వృద్ధితో చైనా కంటే వెనుక ఉండిపోతోందని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్ కు నెటిజన్లు నెగెటివ్ గా రెస్పాన్స్ అయ్యారు. మోడీ సర్కార్ బడ్జెట్ పెట్టాక మీరు, దేశం నిరాశకు గురి అవుతారని..ముందే అంత సంబరపడకండి అంటూ చురకలంటిచారు.