Begin typing your search above and press return to search.

నాకు ఆ కోరిక లేదంటున్న ఆనంద్ మహీంద్రా..!

By:  Tupaki Desk   |   12 Dec 2022 2:30 AM GMT
నాకు ఆ కోరిక లేదంటున్న ఆనంద్ మహీంద్రా..!
X
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ ఉంటారనే సంగతి అందరికీ తెలిసిందే. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మన దేశంలోని కొందరి వ్యక్తులు టాలెంట్ ను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్త ఆవిష్కరణలు చేసే వ్యక్తులకు సంబంధించిన వీడియోలను తరుచూ పోస్ట్ చేస్తూ తరుచూ ట్రెండింగ్ లో ఉంటారు.

వీటితో పాటు తనను ఎంతో ఆకట్టుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. అలాగే సమకాలీన రాజకీయ, వ్యాపార విషయాలపై తనదైన శైలిలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన ఫాలోవర్స్ సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన ఫాలోవర్స్ కోటికి పైగా ఉంది.

ప్రతీ యేటా మాదిరిగానే ఫోర్బ్స్ సంస్థ 2022 సంవత్సరానికి సంబంధించి అత్యంత సంపన్నుల జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ జాబితాలో ఆనంద్ మహీంద్రా 2.6 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులతో 91 వ స్థానంలో నిలిచారు. దేశంలో తొలి వంద మంది బిలియన్లలో ఆనంద్ మహీంద్రా పేరు ఉండటంపై నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఈమేరకు ఓ నెటిజన్ 'దేశంలో అత్యంత ధనవంతుల జాబితాలో మీరెప్పుడు నెంబర్ వన్ అవుతారని' ఆనంద్ మహీంద్రాను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించాడు. దీనికి ఆనంద్ మహేంద్రా సైతం తన మనసులోని మాటను వెల్లడించారు. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు వైరల్ గా మారుతున్నారు. ఇంతకీ ఆయన అత్యంత సంపాదనపై ఏం మాట్లాడారంటే..!

'నిజమేంటంటే.. నేను ఎన్నటికీ అత్యంత సంపన్నుడిని కాలేను.. ఎందుకంటే అది ఎప్పుడూ తన కోరిక కాదని'' వెల్లడించారు. జీవితంలో సంపాదన కంటే కూడా సంతోషం ముఖ్యమనే ఆలోచనతో ఆనంద్ మహీంద్రా ఉండటం వల్ల ఈ మాటను చెప్పారని అర్థమవుతోంది. ఆయన పోస్టు చేసే వీడియోలు సైతం ఇలానే ఉంటూ అందరినీ ఆకర్షిస్తుంటాయి.

ప్రతిభకు పేదరికం అడ్డు కాదనే రీతిలో ఆయన పలువురి వినూత్న ఆలోచనలు ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఆ వ్యక్తులను సైతం పాపులర్ చేస్తుంటారు. కాగా దేశంలోని తొలి 100 మంది బిలియన్ల ఆస్తుల విలువ 800 బిలియన్లకు చేరడం గమనార్హం. సంపద మొత్తం కొందరి వద్దకే కేంద్రీకృతం అవుతుండటంతో ప్రభుత్వ విధానాలపై నెటిజన్లు తమదైన శైలిలో ఓ రేంజులో చర్చిస్తున్నారు.