Begin typing your search above and press return to search.

పాక్ ప్రధానిని వదలని ఆనంద్ మహీంద్రా

By:  Tupaki Desk   |   26 Aug 2019 8:31 AM GMT
పాక్ ప్రధానిని వదలని ఆనంద్ మహీంద్రా
X
ఆర్టికల్ 370 రద్దు.. కశ్మీర్ విభజన తర్వాత భారత్-పాకిస్తాన్ ల మధ్య వైరం మరింత పెరిగిపోయింది. కశ్మీర్ ఇష్యూను పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రపంచ దేశాల ముందు రచ్చ చేస్తున్నారు. దీంతో పాక్ ప్రధానిపై సహజంగానే దేశంలోని వ్యక్తుల్లో అసహనం పెరిగిపోతోంది.ఇక సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉండే దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర కూడా తాజాగా పాకిస్తాన్ ప్రధాని మాట్లాడిన వీడియోను షేర్చేసి సెటైర్ల వర్షం కురిపించారు. మహీంద్ర డైలాగులకు నెటిజన్లు సూపర్ అంటూ పగలబడి నవ్వేస్తున్నారు.

తాజాగా ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో పాక్ ప్రధాని మాట్లాడిన వీడియోను షేర్ చేశాడు.. దానిపై ‘దేవుడా.. నీకు థ్యాంక్స్.. ఈ వ్యక్తిని మాకు చరిత్ర,జాగ్రఫీ టీచర్ ను కాకుండా చేశావ్ ’ అంటూ కామెంట్ పెట్టారు. దీంతో ఇది వైరల్ గా మారింది. పాక్ ప్రధాని పరువును తీస్తోంది.

ఇంతకీ ఆనంద్ మహీంద్ర పెట్టిన వీడియోలో విషయం ఏంటంటే.. ఇరాన్ పర్యటనకు వెళ్లిన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఆ దేశ అధ్యక్షుడు, ప్రధానులతో మాట్లాడుతూ ‘జర్మనీ, జపాన్ దేశాలు పక్కపక్కనే ఉంటాయని.. సరిహద్దులు పంచుకుంటున్న ఈ రెండు దేశాలు రెండో ప్రపంచ యుద్ధంలో సర్వం కోల్పోయి యుద్ధం అనంతరం పరిశ్రమలతో అభివృద్ధి చెందాయని.. మనమూ అలానే చెందుదామని’ ఇమ్రాన్ సెలవిచ్చారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.

జర్మనీ, జపాన్ లు పక్కపక్కన ఉండే దేశాలు కావు.. ఈ రెంటింటి సరిహద్దులు కలుసుకోవు. వీటి మధ్య కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాకిస్తాన్ ప్రధానికి ఈమాత్రం చరిత్రపై నాలెడ్జ్ లేకుండా మాట్లాడిన వైనంపై నెటిజన్లు సెటైర్లు వేశారు. ఆ వీడియోనే ఆనంద్ మహీంద్ర తాజాగా షేర్ చేసి పాకిస్తాన్ ప్రధానిని ఎండగట్టారు.


వీడియో కోసం క్లిక్ చేయండి