Begin typing your search above and press return to search.

ఆనంద్ మహీంద్రా మెచ్చిన ‘పోర్టబుల్ మ్యారేజ్ హాల్’..వైరల్ వీడియో

By:  Tupaki Desk   |   26 Sept 2022 6:21 PM IST
ఆనంద్ మహీంద్రా మెచ్చిన ‘పోర్టబుల్ మ్యారేజ్ హాల్’..వైరల్ వీడియో
X
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దేశంలోని వింతలు విశేషాలు.. క్రియేటివీటీ వీడియోలను షేర్ చేస్తూ అందరినీ ప్రోత్సహిస్తుంటారు. తనకు తోచిన సాయం కూడా ఆ ఆవిష్కర్తలకు చేస్తుంటాడు. తాజాగా మరో వీడియోను ఆయన షేర్ చేశాడు. ఎంతో మంది వేడుకల కష్టాలు తీర్చే ఆ పోర్టబుల్ ‘మ్యారేజ్ హాల్’ అద్భుతమని ప్రశంసించాడు.

తాజాగా ఓ ‘మొబైల్ మ్యారేజ్ హాలు’ వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశాడు. షిప్పింగ్ కంటైనర్ ను ఓ అద్భుతమైన కల్యాణ వేదికగా మలిచిన ఆలోచనకు ముగ్ధుడైన ఆయన.. దీన్ని డిజైన్ చేసిన వ్యక్తిని కలవాలనుకుంటున్నట్టు ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఇది చాలా క్రియేటివ్ గా ఉందని.. మారుమూల ప్రదేశాల్లోనూ మంచి సదుపాయాలు అందిస్తోందని ప్రశంసించాడు. అంతేకాకుండా పర్యావరణ హితమైనదని కొనియాడారు. అత్యధిక జనసాంద్రత గల మన దేశంలో శాశ్వతంగా స్థలం అవసరం ఉండదని.. ఇలాంటి మొబైల్ మ్యారేజ్ హాల్స్ ఎంతో అవసరం అని పేర్కొన్నాడు.

40 అడుగుల పొడవు కలిగిన షిప్పింగ్ కంటైనర్ లో ఫోల్డ్ చేసేలా కొన్ని ప్రత్యేక భాగాలున్నాయి. ఇది తెరుచుకున్నప్పుడు కంటైనర్ వెడల్పు 30 అడుగుల వరకూ విస్తరిస్తుంది. కంటైనర్ ను కల్యాణ వేదికలా కనిపించేలా దాదాపు 1200 చదరపు అడుగుల విస్తీర్ణంలో మంచి స్టైలిష్ ఇంటీరియర్ డిజైన్లతో పాటు సకల హంగులతో తీర్చిదిద్దారు. మామూలుగా నగరాల్లోని మినీ కళ్యాణ వేదికలకు ఏమాత్రం తీసిపోకుండా ఏసీలు, భోజన వసతులు ఇతర సౌకర్యాలతో ఆతిథ్యం కల్పించేలా దీన్ని డిజైన్ చేశారు.

ఈ మొబైల్ మ్యారేజ్ హాల్ కల్యాణ మండపానికి దాదాపు 200 మందికి ఆతిథ్యం కల్పించేలా సామర్థ్యం ఉంది. ఫోల్డ్ చేసుకొనే వెసులుబాటుతో ఉన్న దీంట్లో రెండు ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. వివాహాలే కాకుండా ఇతర ఈవెంట్ల కోసమూ దీన్ని వేదికగా ఉపయోగించుకోవచ్చు. వర్షకాలంలోనూ బహిరంగ వేదికలకు ఇదో గొప్ప ప్రత్యామ్మాయం అంటూ నిర్వాహకులు తెలిపారు. మొత్తానికి ఎవరికి పుట్టిందో కానీ ఈ మొబైల్ కళ్యాణ వేదిక మాత్రం ట్రక్కు మాత్రం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.