Begin typing your search above and press return to search.

చెస్ బోర్డుపై ఇరు రాజ్యాల యుద్ధం.. ఇదో అద్భుతం

By:  Tupaki Desk   |   30 July 2022 12:58 PM GMT
చెస్ బోర్డుపై ఇరు రాజ్యాల యుద్ధం.. ఇదో అద్భుతం
X
తమిళనాడులో జరుగుతున్న 44వ చెస్ ఒలంపియాడ్ టోర్నీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచదేశాల చెస్ క్రీడాకారులు ఈ టోర్నీకి చేరుకున్నారు. ప్రభుత్వం వంద కోట్లు ఖర్చు చేసి మరీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ప్రారంభోత్సవంలో చెస్ బోర్డు లాంటి స్టేజీ ఏర్పాటు చేశారు. దీనిపై ఇరు రాజ్యాలు యుద్ధం చేసుకునే డ్యాన్స్ ఎంతో ఆకట్టుకుంటోంది. పుదుక్కొట్టె కలెక్టర్ కవిత దీనికి కొరియో గ్రఫీ చేసినట్లు తెలుస్తోంది.

తమిళనాడు చెస్ పోటీలు రాజకీయ రూపు సంతరించుకున్నాయి. బీజేపీలో వ్యూహాలు మరోవైపు డీఎంకే ప్రతివ్యూహాలు నడుస్తున్నాయి. ఓవైపు పీఎం మోడీ దళం ఎత్తులు.. ఇంకో వైపు సీఎం స్టాలిన్ సైన్యం పైఎత్తులు ఇలా తమిళనాడులో ‘పొలిటికల్ చెస్ వార్’ ముదిరింది. చదరంగం కాదు.. రణరంగం అన్నట్లుగా తమిళనాడులో మారిపోయింది. చెస్ ఒలింపియాడ్ లో సత్తా చాటేందుకు భారత్ ఆటగాళ్లు సిద్ధమవుతుంటే.. మరోవైపు కాషాయదళం తమ జిత్తులు ప్రదర్శిస్తున్నారు. చెస్ ఒలింపియాడ్ సాక్షిగా బీజేపీ , డీఎంకే పోస్టర్ రాజకీయాలు ముదిరి పాకాన పడుతున్నాయి.

చెస్ ఒలింపియాడ్ పోస్టర్లలో ప్రధాని మోడీ ఫొటోలు లేకపోవడంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఊరుకోకుండా మోడీ పోస్టర్లను అంటిస్తున్నారు తమిళనాడు బీజేపీ నేతలు. తమిళనాడులో 44వ చెస్ ఒలింపియాడ్ జులై 28న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. దీని కోసం ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో భాగంగా బిల్ బోర్డు హోర్డింగ్ లను ఏర్పాటు చేసింది.

ఈ హోర్డింగ్ లో మోడీ ఫొటో లేకపోవడంతో తమిళనాడు బీజేపీ కార్యకర్త అమర్ ప్రసాద్ రెడ్డి స్టాలిన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే కాకుండా ఇది అతిపెద్ద తప్పుగా భావించి రాద్ధాంతం చేశారు.

మరో ఇద్దరి సన్నిహితులతో కలిసి మోడీ ఫొటోలను ఆయా హోర్డింగ్ బోర్డులపై అతికించడమే కాకుండా ఈ ఘటన తాలూకా వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.