Begin typing your search above and press return to search.
ఆనందయ్య మందు పంపిణీకి డేట్ ఫిక్స్ ... ఎప్పుడంటే ?
By: Tupaki Desk | 4 Jun 2021 6:33 AM GMTఆనందయ్య కృష్ణపట్నం పోర్టులో కరోనా మందు తయారీ చేస్తున్నారు. వచ్చే సోమవారం .. అనగా ఈ నెల 7 నుంచి మందు పంపిణీ ప్రారంభం కావచ్చని సమాచారం. మందు పంపిణీపై విధి విధానాలను ఖరారు చేయడం కోసం మంగళవారం ఆనందయ్యతో కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఇతర శాఖల ముఖ్య అధికారులు, సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమావేశం అయ్యారు. తాము చెప్పేవరకు ఆనందయ్య మందు కోసం ఎవరూ కృష్ణపట్నం రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి అవసరమైన మూలికలు, ఇతర పదార్థాలు సిద్ధం చేసుకోవడానికి ఆనం దయ్యకు ఐదు రోజుల సమయం పడుతుందన్నారు.
బహుశా సోమవారం నుంచి మందు పంపిణీ మొదలవుతుందని వెల్లడించారు. అయితే ఈ మందును www.childeal.in లో ఆర్డర్ చేయాలంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ వెబ్సైట్ కు మాకు ఎటువంటి సంబంధం లేదు అని పేర్కొన్నారు. అయితే ఈ మందు పంపిణీ విషయంలో నాకు గాని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గానీ ఎటువంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేసారు. అయితే ప్రస్తుతం కృష్ణపట్నం లో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఇక ఆధార్ కార్డు ఉంటేనే కృష్ణపట్నం గ్రామంలోకి అనుమతి ఇస్తున్నారు పోలీసులు.
ఆనందయ్య మందు పంపిణీకి ముఖ్యంగా నాలుగు పద్ధతులను ఎంచుకున్నారు. తొలుత అన్ని జిల్లాల కలెక్టర్లకు జిల్లాకు పదివేల మంది పాజిటివ్ బాధితులకు సరిపడా మందు పాకెట్లను పంపిణీ చేయనున్నారు. కలెక్టర్ నేతృత్వంలో ఆ జిల్లా పరిధిలోని కరోనా కేర్ సెంటర్లు, హోం ఐసొలేషన్ లో ఉన్న పాజిటివ్ బాధితులకు రెవెన్యూ, వలంటీర్ల ద్వారా నేరుగా మందు పాకెట్లు అందేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక రెండవది వెబ్ పద్ధతి, వ్యక్తిగతంగా మందులు కావాలనుకున్నవారి కోసం వెబ్ సర్వీసును ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా బుక్ చేసుకుంటే కొరియర్ ద్వారా మందులు పంపిస్తారు. ఇక మూడో పద్ధతి అంటే, కొరియర్ సర్వీసులు లేని గ్రామీణ ప్రాంతాలకు పోస్టల్ ద్వారా పంపిణీ చేస్తారు. నాలుగో పద్ధతి కాల్ సెంటర్, మందు బుకింగ్ కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే వారికి పోస్టు ద్వారా మందులు అందే ఏర్పాట్లు చేస్తున్నారు.