Begin typing your search above and press return to search.

ఆనందయ్య కరోనా మందు తయారీకి వనమూలికల తరలింపు

By:  Tupaki Desk   |   5 Jun 2021 3:30 AM GMT
ఆనందయ్య  కరోనా మందు తయారీకి  వనమూలికల తరలింపు
X
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీ చేస్తున్నారు ఆనందయ్య. ఆయన మందు పనిచేస్తుందా, లేదా, అన్నదే చర్చ. అందరి అనుమానాల్ని, సందేహాల్ని పటాపంచల్ చేస్తూ హైకోర్టు లైన్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో మందు తయారిపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడింది. ఇదిలా ఉంటే .. కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య మందు తయారీ కోసం వనమూలికలను ట్రాక్టర్ లలో తరలిస్తున్నారు. వేప,మామిడి,నేరుడు ఆకులు,జిల్లేడు పులును వెంకటాచలం అడవి ప్రాంతం నుంచి కృష్ణపట్నం పోర్టు కు తరలిస్తున్నారు.

అయితే సోమవారం నుంచి మందు పంపిణీ చేయనుండగా , దీనికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆనందయ్య. ఇక ప్రస్తుతం కృష్ణ పట్నం గ్రామంలో 144 సెక్షన్ కొనసాగుతుంది. స్థానికులను తప్ప ఇతరుల్ని గ్రామంలోకి రానివ్వడం లేదు పోలీసులు. కృష్ణపట్నం పోర్టులో మందు తయారీలో పాల్గొనే వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి అక్కడే వసతులు కల్పిస్తున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు మందును పంపిణీ చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆన్‌ లైన్‌ లో యాప్‌ ద్వారా మందు కోసం బుక్‌ చేసుకోవచ్చన్నారు. ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా మందును పంపిణీ చేస్తామన్నారు. మొబైల్ యాప్ రూపకల్పన పూర్తయిన తర్వాత అందులో వివరాలు ఎలా పొందుపరచాలో.. ఎంతమేర మందును వినియోగించాలో , బాధితులు మందును ఎలా వాడాలో కూడా ఆ యాప్‌లో పొందుపరుస్తామని కలెక్టర్ చక్రధర్‌. ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తామన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌. పోస్టల్‌, కొరియర్‌ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. మొదట కరోనా సోకిన వారికి మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు.