Begin typing your search above and press return to search.
ఆనందయ్య కోపానికి అసలు కారణం అదేనా ?
By: Tupaki Desk | 14 July 2021 5:02 AM GMTఆనందయ్య..కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా ఈ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య పేరు మారుమోగింది. ప్రపంచం, దేశం వైజ్ఞానికంగా, సైన్స్ పరంగా ఇంతగా అభివృద్ధి చెందినా, ఆకాశంలోకి రాకెట్స్ లో వెళ్లి వస్తున్నా కూడా ఓ కంటికి కనిపించని మహమ్మారిని అరికట్టడానికి యావత్ ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. అగ్రరాజ్యంగా వెలుగొందే అమెరికా సైతం కరోనా వైరస్ దెబ్బకి హడలిపోయింది. ఆ తర్వాత ఒక్కొక్క దేశం కరోనా వ్యాక్సిన్ ను వెలుగులోకి తీసుకువచ్చినా కూడా ఆ వ్యాక్సిన్ పూర్తిగా కరోనా ను అరికడతాయి అని చెప్పలేకపోతున్నారు. గుడ్డి కన్నా మెల్ల మేలు అన్నట్టుగా..ఏ వ్యాక్సిన్ లేకపోవడంతో కరోనా వచ్చిన సమయంలో తట్టుకునే శక్తిని ఇచ్చే వ్యాక్సిన్ తోనే ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నెల్లూరు జిల్లా , కృష్ణపట్నం కి చెందిన ఆయుర్వేదం ఆనందయ్య ..కరోనా వైరస్ కి విరుగుడు కనిపెట్టి ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత ఆ మందు ఫెమస్ అవ్వడం , రాష్ట్ర ప్రభుత్వం ఆ మందు పంపిణిని ఆపేసి, నిపుణుల పరీక్షల తర్వాత మళ్లీ మందు పంపిణీకి అనుమతి ఇచ్చారు. కరోనా వైరస్ రోగుల ప్రాణాలు రక్షిస్తున్న ఆ మందు వెనుక రహస్యాన్ని తెలుసుకుని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆ మందులో ఆయన ఉపయోగిస్తున్న మూలికలు, పదార్థాల్లో ఏవీ హానికరం కాదని నిర్ధరించారు. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ఆనందయ్య మందును అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే, కంటిలో వేసే మందు తప్ప.. మిగతావన్నీ రోగులకు అందివచ్చని షరతు విధించింది. కంట్లో వేసే మందుపై మాత్రం నిషేధాన్ని కొనసాగిస్తుంది.
అయితే , ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చిన సమయంలో నకిలీ మందు కూడా మార్కెట్ లోకి వచ్చేసింది. ఆనందయ్య మందు కరోనా కట్టడికి పనికి వస్తుంది అనగానే చాలామంది ఆనందయ్యలు వెలుగులోకి వచ్చారు. అసలు ఆనందయ్య మందు కంటే నకిలీ మందే ఎక్కువగా మార్కెట్ లో అమ్ముడైందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఇన్ని రోజులు ఆనందయ్య కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడీ నకిలీ బాగోతం ఎక్కువయ్యే సరికి ఆయన ఫైర్ అయ్యారు. తన బిజినెస్ తగ్గిపోతుందనే లేక, నకిలీ మందుతో తన పేరుకి చెడ్డపేరు వస్తుందనే భయమో మొత్తంగా ఆనందయ్య నకిలీలపై మొదటిసారి ఫైర్ అయ్యారు.
నాకు దేశంలో ఎక్కడేకాని బ్రాంచులు లేవు అని , ఒకే ఒక చోటనే నేను మందు తయారు చేస్తున్నానని తెలిపారు. అలాగే నకిలీలకు చెక్ పెట్టేందుకు, దేశవ్యాప్తంగా వస్తున్న ఆర్డర్లకు సకాలంలో సప్లై చేసేందుకు ఆనందయ్య కొత్త పద్ధతి పాటించబోతున్నారు. ఇప్పటి వరకూ ఆయుర్వేదం మందుని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లలో చేతితోనే ప్యాకింగ్ చేసేవారు. కానీ తొలిసారి దీనికోసం రేగుపండు గుజ్జుని తయారుచేసి, ప్యాక్ చేసే ప్లాంట్ ని ఆయన కొనుగోలు చేశరని తెలుస్తోంది. నెల్లూరు పట్టణ శివారులో ఉన్న ఈ ప్లాంట్ లో మందు తయారీ చేపడుతున్నారట. ఇకపై ఈ ప్లాంట్ లోనే ఆనందయ్య హాల్ మార్క్ లోగో ఉన్న కవర్లలో ఆయుర్వేదం మందు ప్యాక్ చేస్తారట. దీన్ని ఆనందయ్య అసలు ముందుగా మార్కెట్ లోకి తీసుకువస్తారట. మొత్తంగా మన దేశంలో అసలు కంటే నకిలీ ఎక్కువగా ప్రాచుర్యం పొందుతుంది అని మరోసారి నిరూపితం అయ్యింది.
పాము కాటుకు వంశపారంపర్యంగా మందు వేసే వైద్యుల్లో ఆనందయ్య కూడా ఒకరు. సాధారణంగా పాము కాటుకు పసర వైద్యం చేస్తారు. అందుకు కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఇప్పుడు కరోనా వైరస్ వేస్తున్న పసర మందు ఇప్పటికిప్పుడు తయారు చేసినది కాదు. ఎప్పటి నుంచో ఉంది. కరోనా సమయంలో ఆయన దాన్ని ప్రయోగించి ఉండవచ్చు. ఆయనకు సిద్ధ వైద్యంపై కూడా అవగాహన ఉంది. పంచ మహాభూతాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా జీవితాన్ని నిలబెట్టవచ్చనే ఫార్ములాతో ఆయన మూలికలను ఉపయోగించారు.
కంటిలో మందు వేయడమనేది కొత్త విషయం కాదు. కానీ, కరోనా వల్ల ఆక్సిజన్ కోల్పోతున్న వ్యక్తి ప్రాణాలు నిలబెట్టేందుకు ఆయనకు ఈ ఆలోచన రావడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే . పాము కాటు వల్ల మెదడుకు ఆక్సిజన్ అందక చనిపోతారు. కాబట్టి ఆయనకు ఆ ఆలోచన వచ్చి ఉండవచ్చు. పైగా ఆయన కంట్లో వేసేందుకు ఉపయోగిస్తున్న పదార్థాలు, మూలికలు సురక్షితమైనవి. వాటిలో ఏవీ హానికరమైనవి కావు అని ఆయుష్ విభాగం, ఆయుర్వేద నిపుణులు సైతం వెల్లడించిన సంగతి తెలిసిందే.