Begin typing your search above and press return to search.
కరోనా మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చిన ఆనందయ్య !
By: Tupaki Desk | 2 Jun 2021 12:37 PM GMTఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ కృష్ణఫట్నం ఆనందయ్య ఇచ్చే కరోనా మందు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఆనందయ్య మందుపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోంది. ఇప్పటికే ఆయూష్ అధికారులు, టీటీడీ ఆయుర్వేద వైద్యులు దీనిని పరిశీలించారు. ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మందుపై అధికారిక అధ్యయనం జరుగుతుండటం, కృష్ణపట్నంకు వేలాది మంది వస్తుండటంతో ఆనందయ్య మందు పంపిణీని నిలిపివేయాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. అయితే , శుక్రవారం నుంచి మందు పంపిణీ ప్రారంభిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆనందయ్య స్పందించారు. ప్రస్తుతం ఆయుర్వేద మందును పంపిణీ చేయడం లేదని.. ప్రభుత్వం ప్రస్తుతం మందు పంపిణీని నిలిపేసిందన్నారు. అలాగే తన దగ్గర మూలికలు కూడా స్టాక్ లేవని.. ప్రభుత్వం అనుమతిచ్చిన తర్వాత.. మూలికలు అందుబాటులోకి వస్తే పంపిణీని ప్రారంభిస్తానని తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని స్పష్టం చేశారు.
మందు పంపిణీపై ఫోకస్ పెట్టారు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య, కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఎమ్మెల్యే, అధికారులతో చర్చలు జరిపిన ఆయన వనమూలికలు, దినుసులు సేకరించే పనిలో పడిపోయారు. మరోవైపు ఇవాళ మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు, అయితే, బయట ప్రాంతాల వారు కృష్ణపట్నం రావొద్దు అని సూచించారు, మీమీ ప్రాంతాలకే మందు పంపిస్తామని.. ముందుగా అన్ని జిల్లాల్లో కరోనా పాజిటివ్ వచ్చినవారి కోసం 5 వేల ప్యాకెట్ల చొప్పున ఆదివారం లేదా సోమవారం రోజు పంపుతామని వెల్లడించారు. పాజిటివ్ రిపోర్ట్ చూపించి, అక్కడే మందు తీసుకోవచ్చు అన్నారు ఆనందయ్య, ఇప్పటికే అధికారులు మందు పంపిణీకి పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కాగా, ఆనందయ్య మందు తీసుకున్నవారికి అందరికీ నయం అయిందనే ప్రచారంతో ఆ మందుపై అందరికీ ఆసక్తి పెరిగింది. ఆనందయ్య మందు పంపిణీ ఆగిపోవడంతో అంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరిగి మళ్లీ ఇప్పుడు ప్రారంభం కాబోతోంది.