Begin typing your search above and press return to search.

బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య కరోనా మందు.. ప్యాకెట్ రూ.10వేలు

By:  Tupaki Desk   |   22 May 2021 11:11 AM GMT
బ్లాక్ మార్కెట్లో ఆనందయ్య కరోనా మందు.. ప్యాకెట్ రూ.10వేలు
X
ఇందుగలరు.. అందు లేదని సందేహం లేదు. అన్నింట్లోనూ బ్లాక్ మార్కెట్ దందా గలదని కొందరు కేటుగాళ్లు నిరూపించారు. కరోనా మహమ్మారిని అంతం చేస్తోందని ప్రచారం సాగిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడి కరోనా మందు ఇప్పుడు సంచలనమైన సంగతి తెలిసిందే. అయితే జనాలు పోటెత్తడంతో ఈ మందు పంపిణీని ఆపేశారు. ప్రస్తుతం ఏపీ సర్కార్, ఐసీఎంఆర్ దీనిపై పరిశోధన చేస్తోంది.

అయితే ఈ ఆయుర్వేద మందును కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నారు. ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటూ ఏకంగా ఒక్కో ప్యాకెట్ ను డిమాండ్ ను బట్టి రూ.3వేల నుంచి రూ.10వేల వరకు పలుకుతోంది.

శుక్రవారం ఒక్కరోజే ఆనందయ్య మందు కోసం 60వేల మంది తరలివచ్చారు. దేశవ్యాప్తంగా ఈ మందుకు డిమాండ్ ఏర్పడింది. అయితే మందును ఏపీ ప్రభుత్వం నిలుపుదల చేసింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కేటుగాళ్లు బ్లాక్ దందాకు తెరలేపారు.

మందు కావాలన్న వారిని సంప్రదిస్తూ ఒక్కో ప్యాకెట్ ను రూ.10వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అంత ఇచ్చుకోలేని వారికి రూ.3-5వేలకు ఒక్కో ప్యాకెట్ ను అమ్ముతున్నారు. శుక్రవారం ఒక్కరోజే భారీగా సొమ్ము వసూలు చేసినట్లు తెలుస్తోంది.

బ్లాక్ దందాపై పోలీసులు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు పోతాయని క్లిష్ట పరిస్థితుల్లో ఈ మందు కొని వేసుకుంటున్న వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. రోగులను దోచుకుంటున్న వీరిని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఆనందయ్య కరోనా మందుకు చెడ్డపేరు రాకుండా చూడాలని కృష్ణపట్నం వాసులు కోరుతున్నారు.