Begin typing your search above and press return to search.

ఆనందయ్య ఐ డ్రాప్స్ ... మరో మూడు నెలల తర్వాతే ..

By:  Tupaki Desk   |   3 Jun 2021 11:30 AM GMT
ఆనందయ్య ఐ డ్రాప్స్ ... మరో మూడు నెలల తర్వాతే  ..
X
నెల్లూరు జిల్లా కృష్ణప‌ట్నంకు చెందిన ఆనంద‌య్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తయారీకి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే కంటిలో వేసే చుక్కల మందుపై హైకోర్టులో ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఆనంద‌య్య చుక్కల మందుకు సంబంధించిన నివేదిక అందింద‌ని ప్రభుత్వం హైకోర్టుకు వివ‌రించింది. కాగా, చుక్కల మందు వ‌ల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండ‌వ‌ని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్‌, నిల్వకు నెల నుంచి మూడు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌ని ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇందువ‌ల్ల మూడు నెల‌ల తర్వాత పంపిణీ చేసే అవ‌కాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

ఆనందయ్య ఐ డ్రాప్స్‌కి అనుమతి ఇవ్వలేమంది ప్రభుత్వం. ఐ డ్రాప్స్‌కి చేసిన పరీక్షల్లో స్టేరిలిటీ టెస్టులో ఇబ్బంది ఉందని ప్రభుత్వం తెలిపింది. అయితే కంటికి సంబంధించిన విషయం కాబట్టే ఇప్పుడే అనుమతి ఇవ్వలేమని…దీనిపై డిటెయిల్డ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అనుమతిస్తామంది. ఇందుకు మూడు నెలల సమయం పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. నివేదిక రాకుండా ఐ డ్రాప్స్ వేయడానికి రికమండ్ చేయలేని స్పష్టం చేసింది ప్రభుత్వం. లంచ్‌ బ్రేక్ తర్వాత ఐ డ్రాప్స్‌కి పర్మిషన్ ఇవ్వాలని పిటిషన్‌పై మరోసారి విచారణ జరగనుంది. ఆనందయ్య చుక్కల మందుకు సంబంధించిన నివేదిక అందిందన ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. చుక్కల మందు వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని తెలిపింది. ఈ ఔషధం ప్యాకింగ్, నిల్వకు నెల నుంచి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఇందువల్ల మూడు నెలల తర్వాత పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.