Begin typing your search above and press return to search.

మోత్కుప‌ల్లి గ‌వ‌ర్న‌ర్ ఆశ‌లపై ఆనందీబెన్ నీళ్లు

By:  Tupaki Desk   |   3 Sep 2016 7:40 AM GMT
మోత్కుప‌ల్లి గ‌వ‌ర్న‌ర్ ఆశ‌లపై ఆనందీబెన్ నీళ్లు
X
టీ టీడీపీ సీనియ‌ర్ నేత‌ - న‌ల్ల‌గొండ జిల్లా తుంగ‌తుర్తి మాజీ ఎమ్మెల్యే మోత్కుప‌ల్లి న‌ర‌సింహులు ఆశ‌ల‌పై మ‌రోసారి ఆనందీ బెన్ రూపంలో నీలి మేఘాలు క‌మ్ముకున్నాయి. టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న ఆయ‌న ఎందుక‌నో గ‌వ‌ర్న‌ర్‌ గా రాణించాల‌ని, త‌న జీవితంలో ఏదో ఒక రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గిరీ చేయాలని తెగ త‌పించిపోతున్న విష‌యం తెలిసిందే. తన పార్టీ అధినేత - ఏపీ సీఎం చంద్ర‌బాబును గ‌తంలో అనేక సార్లు ఇదే విష‌యంపై ఆయ‌న చ‌ర్చించారు కూడా. ఇటీవ‌ల తెలంగాణ సీఎం కేసీఆర్ ఆక‌ర్ష్ ఆప‌రేష‌న్‌ కు సైతం లొంగ‌కుండా టీడీపీలోనే కొన‌సాగుతున్నారు మోత్కుప‌ల్లి. మొన్నామ‌ధ్య తిరుప‌తిలో జ‌రిగిన టీడీపీ మ‌హానాడులో కూడా ఇదే విష‌యాన్ని ఆయ‌న చెప్పారు. చంద్ర‌బాబు చేతిలో త‌న జీవితం ఉంద‌న్నారు. ఆయ‌నే త‌న జీవితానికి దారి చూపించాల‌ని స‌భ‌లో ప్ర‌క‌టించేశారు కూడా.

ఇక‌, ఆ త‌ర్వాత ప‌లు రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల‌ను తీసేస్తూ.. కొత్త వారిని నియ‌మించింది మోడీ ప్ర‌భుత్వం. దీంతో త‌న‌కు ఏదో ఒక రాష్ట్రంలో సీటు క‌న్ఫ‌ర్మ్ అనుకున్నారు మోత్కుప‌ల్లి. అయితే, అప్ప‌ట్లో అది నెర‌వేర‌లేదు. ఇక‌, తాజాగా త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ రోశ‌య్య ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో ఆ సీటు ఖాళీ అయింది. దీంతో త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గిరీని త‌న‌కు అప్ప‌గిస్తార‌ని మోత్కుప‌ల్లి ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఈయ‌న ఆశ‌ల‌కు త‌గిన విధంగానే కేంద్రం కూడా స్పందించింది. మోత్కుప‌ల్లిని త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌ గా పంపాల‌ని నిర్ణ‌యించి ఆ మేర‌కు స‌మాచారం కూడా ఇచ్చింది. కానీ, ఇంత‌లో గుజ‌రాత్ మాజీ సీఎం ఆనందీబెన్ ప‌టేల్‌.. మోత్కుప‌ల్లికి అడ్డం త‌గులుతున్న‌ట్టు వెలుగులోకి వ‌చ్చింది. వాస్త‌వానికి ఆమె స్వ‌చ్ఛందంగా త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేసినా.. దీనివెనుక గ‌వ‌ర్న‌ర్ పోస్టుకు సంబంధించి గ‌ట్టి హామీనే పొందింది.

దీంతో ఆమెను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ కి గ‌వ‌ర్న‌ర్‌ గా పంపాల‌ని మోడీ ప్ర‌భుత్వం ప్లాన్ చేసింది. అయితే, ఇంత‌లో ఏమైందో ఏమో.. బెన్ మాత్రం.. తాను త‌మిళ‌నాడుకైతే వెళ్తాను అని ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు తెలిసింది. దీంతో ఇప్పుడు మోత్కుప‌ల్లికి ఎస‌రు వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది. ఇక‌, దీనిపై ఎలాంటి నిర్ణ‌య‌మూ తీసుకోని కేంద్రం.. ఇప్ప‌టికిప్పుడు మాత్రం మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్న మ‌న తెలుగు నేత చెన్న‌మ‌నేని విద్యాసాగ‌ర‌రావుని తాత్కాలిక గ‌వ‌ర్న‌ర్‌ గా నియ‌మించింది. ఆయ‌న నిన్న ప్ర‌మాణం కూడా చేసేశారు. మ‌రి ఈ నేప‌థ్యంలో మోత్కుప‌ల్లిని ఊరించిన త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గిరీ ఎప్ప‌టికి ఆయ‌న‌కు సొంతం అయ్యేనో అని ఆయ‌న అనుచ‌రులు వెయ్యిక‌ళ్ల‌తో వెయిట్ చేస్తున్నారు.