Begin typing your search above and press return to search.

అది బలవంతపు స్వచ్ఛంద రాజీమానా!

By:  Tupaki Desk   |   1 Aug 2016 2:27 PM GMT
అది బలవంతపు స్వచ్ఛంద రాజీమానా!
X
రాజకీయాలు కామెడీ కామెడీగా మారిపోయాయి. ప్రజలు పిచ్చోళ్లు అనుకుంటారో ఏమో కానీ.. తమకు నచ్చినట్లుగా చెప్పే మాటలు చూస్తే.. పార్టీల రాజకీయం మరీ ఇంత ఛీప్ గా ఉంటుందనిపించక మానదు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆనందీ పటేల్ ను ఆయన వారసురాలిగా ఎంపిక చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. అయితే.. ఆమె ఆశించినంతగా రాణించకపోవటం బీజేపీ అధినాయకత్వానికి ఆగ్రహం కలిగించింది. దీంతో.. ఆమెను తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు.

పటేళ్ల ఉద్యమం రోజురోజుకి పెరగటం.. దాన్ని కంట్రోల్ చేయటంలో ఆమె విఫలం కావటం.. మరోవైపు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. ఆమెను కంటిన్యూ చేస్తే మొదటికే మోసం వస్తుందన్న అభిప్రాయానికి వచ్చిన మోడీ పరివారం ఆమె రాజీనామాను కోరినట్లుగా చెబుతున్నారు. పైకి అలా చెబితే పరువు పోవటం ఖాయమవుతుందన్న ఉద్దేశంతో బలిపశువు అయ్యేందుకు ఆనందీ సిద్ధమయ్యారు.

తన వయసు మీద పడటంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించలేకపోతున్నానని.. ఇక తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఆమె పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు లేఖ రాశారు. ఈ పరిణామంతో గుజరాత్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మరోవైపు ఆనందీ బెన్ పటేల్ రాజీనామా తమకు అందినట్లుగా వెల్లడించారు అమిత్ షా. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయంలో గుర్తుకు రాని వయసు.. ఇన్నేళ్లు సీఎం పదవిని నిర్వహించిన తర్వాత ఆనందీకి గుర్తుకు రావటం ఏమిటో? ఇంతకాలం సీఎంగా అవకాశం ఇచ్చిన అధినాయకత్వంపై చూస్తూ.. చూస్తూ విమర్శలు చేయలేరు కదా. అలా చేస్తే.. భవిష్యత్ అవకాశాలకు దెబ్బ పడిపోదూ..?