Begin typing your search above and press return to search.
అమిత్ షా వల్లే ఆనంది రాజీనామా చేశారా?
By: Tupaki Desk | 2 Aug 2016 2:27 PM GMTగుజరాత్ సీఎంగా ఆనంది బెన్ రాజీనామా చేయడం వెనుక వయోభారం కారణం కాదని తెలుస్తోంది. అమిత్ షా రాజకీయాలను తట్టుకోలేక ఆమె వైదొలిగారని తెలుస్తోంది. అనందీబెన్ అనుచరులు ఈ మేరకు డైరెక్టుగా అమిత్ షాపై ఆరోపణలు చేస్తున్నారు. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా మంత్రిగా పని చేసిన అమిత్ షా అక్కడ బ్యాక్ బోన్ గా వ్యవహరించేవారన్న సంగతి బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో గుజరాత్ రాజకీయాల్లో ఆయనది చెరగని ముద్ర. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయనను గుజరాత్ కు చెందిన ఉన్నతాధికారులు వివిధ విషయాలపై సంప్రదించేవారు. దీంతో పాలనపై ముఖ్యమంత్రి కంటే అమిత్ షాకే పట్టు ఎక్కువని వారు పేర్కొంటున్నారు. దీంతో ఆనందికి పరిపాలనలో స్వేచ్ఛ లేకపోయింది. నిజంగా వయసే కారణమైతే 75 వసంతంలోకి అడుగుపెట్టాక నవంబర్ లో ఆమె స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకునేవారని అంటున్నారు.
అమిత్ షా తెర వెనుక రాజకీయాలు చేసి - వివాదాలు రేపి ఆమె వైదొలిగేలా చేశారని ఆరోపిస్తున్నారు. దీనికి తోడు నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో అక్కడ బిజెపికి ఎన్నికల భయం కూడా పట్టుకుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలు అంతకంతకూ మసకబారుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో వైఫల్యం - పటేళ్ల ఉద్యమం... మరో వైపు దళితులపై గో రక్షక దళాల ముసుగులో కాషాయ మూకల దౌర్జన్యాలపై గుజరాత్ లో వెల్లువెత్తిన నిరసనాగ్రహాలు... ఆ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బిజెపి - ఆరెస్సెస్ మైనార్టీలు - దళితులపై సాగిస్తున్న దాడులు - కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే బిజెపి ప్రభుత్వ విధానాలు గుజరాత్ ను సంక్షోభంలోకి నెట్టాయి. ఈ వాస్తవాన్ని అంగీకరించడానికి బదులు - ముఖ్యమంత్రి ఆనందిబెన్ అసమర్థత కింద బిజెపి జమకట్టేసి ఆమెను రాజీనామా చేసేలా పురికొల్పింది.
విధానాలపర మైన వైఫల్యాన్ని పాలనాపరమైన వైఫల్యాలుగా చూపే ప్రయత్నం చేయడమతా అమిత్ షా కేంద్రంగానే జరిగిందని తెలుస్తోంది. ఆనందిబెన్ స్థానే కొత్త బొమ్మను తెరపైకి తెచ్చేందుకు నెల రోజుల క్రితమే బిజెపి బ్లూ ప్రింట్ సిద్ధం చేసిందని సమాచారం. నిజానికి మోడీ గీచిన విధానాల గీటును ఆనంది ఎన్నడూ దాటలేదు. మోడీ విఢానాలనే తు.చ. తప్పక పాటించారు. ఆనందిని సీఎం చేసినప్పుడు అసంతృప్తిని వ్యక్తం చేసిన ఏకైక వ్యక్తి అమిత్ షా. మరోవైపు మోడీ కేబినెట్ లో ఇద్దరూ ఒకేసారి మంత్రులుగానూ పనిచేశారు. ఆ సమయంలో పదేళ్లు వారి మధ్య సత్సంబంధాలు లేవని తెలుస్తోంది. ఆనంది అధికార పగ్గాలు చేపట్టాక ప్రచ్ఛన్న యుద్ధం మరింత ముదిరింది. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడిగా విజయ్ రూపానిని నియమించడం కూడా అమిత్ వ్యూహమే. మరోవైపు స్థానిక ఎన్నికల్లో బిజెపి వైఫల్యం ఆనంది బెన్ పటేల్ పదవికి ఎసరు తెచ్చిపెట్టిందని పరిశీలకులు అంటున్నారు. ఇవన్నీ కలిసి ఆనంది వైఫల్యాంగా చిత్రీకరించి ఆమెను బలిపశువు చేశారని ఆమె అనుచరులు అంటున్నారు.