Begin typing your search above and press return to search.
రాహుల్ హైబ్రిడ్ బ్రీడ్ అంటున్న కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 31 Jan 2019 8:40 AM GMTకేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే నిత్యం ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. హిందూ బాలికలపై ఇతర మతస్థుల యువకులు చేయివేస్తే హిందూ యువత వారి చేతులు నరికి చరిత్ర సృష్టించేందుకు సిద్ధం కావాలని హెగ్దే ఇటీవల చేసిన వ్యాఖ్యాలు తీవ్ర కలకలం రేపిన సంగతి తెల్సిందే. అలాగే కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండురావు ఓ ముస్లిం మహిళ వెనుక దాక్కున్నారని వ్యాఖ్యనించడం వివాదాస్పమైంది. కాగా ఈసారి ఆయన రాహుల్ గాంధీపై తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మళ్లీ వార్తల్లో నిలిచారు.
రాహుల్ గాంధీ తన కులగోత్రాలను సైతం రాజకీయాలకు వాడుకుంటూ, తన మూలలపైనే నిసిగ్గుగా అస్యతాలు చెబుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ హైబ్రీడ్ బీడ్ అంటూ ఎద్దేవా చేశారు. ముస్లిం తండ్రి, క్రిస్టియన్ తల్లికి జన్మించిన కుమారుడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఇది ప్రపంచంలో ఎక్కడ జరుగదని కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ ప్రయోగశాలలోనే ఇలాంటి విచిత్రాలు జరుగుతాయని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే అనంత్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో హిందూ ఓట్లు చీలిపోకుండా చూసుకునే ఎత్తులో భాగంగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఇంతటితో ఆగకుండా మున్మందు మరిన్ని వివాస్పద వ్యాఖ్యలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరీ ఇలాంటి వ్యాఖ్యలు ఎటువైపు దారితీస్తాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.