Begin typing your search above and press return to search.
కేంద్రమంత్రి నాలుక కోస్తే కోటి రూపాయలు
By: Tupaki Desk | 26 Dec 2017 6:25 PM GMTఒకరు నోటికి పనిచెప్పి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటే.. ఇంకొకరు అలాంటి దురుసు నోట్లోని నాలుకను కోసి పారేయాలంటూ మరింత వేడి పెంచుతున్నారు. నాలుక కోసిపారేయాలని మామూలుగా అనడం కాదు... అలా కోసి తెచ్చినవారికి కోటి రూపాయల బహుమతి ప్రకటించాడో కర్ణాటక లీడర్.
దేశ ప్రజలు మత సామరస్యంతో జీవిస్తున్న తరుణంలో వారి మధ్య విద్వేషాలు రగిలేలా వ్యాఖ్యలు చేస్తున్న కేంద్ర మంత్రి, ఉత్తరాఖండ్ ఎంపీ అనంతకుమార్ హెగ్డే నాలుకను కత్తిరించిన వారికి కోటి రూపాయలు నజరానాగా ఇస్తానంటూ కర్ణాటకలోని కలబురిగి జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు గురుశాంత్ పటేదార్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో ఓట్ల కోసం అనంతకుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, అందుకే, తాను ఇలాంటి ప్రకటన చేస్తున్నానని చెప్పారు. జనవరి 26వ తేదీ లోపు ఆయన నాలుక కోసి తెచ్చిచ్చినవారికి ఈ బహుమతి ఉంటుందన్నారు.
భారత రాజ్యాంగాన్ని అనంతకుమార్ హెగ్డే విమర్శిస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారెవరైనా దేశద్రోహుల కిందకే వస్తారని, హెగ్డేపై ప్రధాని మోదీ తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఇంతకుముందు కూడా పలువురు నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు కౌంటర్‌గా మరికొందరు ఇలాగే నాలుకలు కోయాలంటూ పిలుపునిచ్చిన సందర్భాలున్నాయి. తాజాగా గురుశాంత్ పటేదార్ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు.