Begin typing your search above and press return to search.

రాహుల్ హైబ్రీడ్‌..ఆయ‌న‌కు డీఎన్ ఏ ప‌రీక్ష‌లు చేయాలి

By:  Tupaki Desk   |   11 March 2019 2:12 PM GMT
రాహుల్ హైబ్రీడ్‌..ఆయ‌న‌కు డీఎన్ ఏ ప‌రీక్ష‌లు చేయాలి
X
వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌కు సుప్ర‌సిద్ధుడు అయిన కేంద్ర‌మంత్రి - ఉత్తర కన్నడ నియోజకవర్గం ఎంపీ అనంత‌కుమార్ హెగ్డే మ‌రోమారు క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. ``సెక్యులర్ అంటే లౌకికవాదం. సెక్యులరిస్ట్ అంటే లౌకికవాది. అంటే ఏ మతానికి సంబంధం లేనివారు. ఆధ్మాత్మిక భావనలు లేనివారని అర్థం. మన రాజ్యాంగంలో ఈ పదానికి ప్రత్యేక స్థానం ఉంది. సెక్యులర్ అనే పదం ఇక కనుమరుగయ్యే అవకాశం ఉంది. రాజ్యాంగాన్ని మార్చేందుకే మేం ఉన్నాం`` అంటూ రాజ్యాంగ గురించి కామెంట్ చేసి అనంత‌రం క్ష‌మాప‌ణ చెప్పిన వ్య‌క్తి. అలాంటి హెగ్దే తాజాగా మ‌రో సంచ‌ల‌న కామెంట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీ కులం గురించి కేంద్ర‌ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. క‌ర్నాట‌క‌లోని సిర్సీలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ సంక‌ర జాతి సంతానం అన్నారు. ముస్లిం తండ్రి - క్రైస్త‌వ త‌ల్లికి రాహుల్ జ‌న్మించాడ‌ని విమ‌ర్శించారు. బ్రాహ్మ‌ణుడిని అని చెప్పుకుంటున్న రాహుల్‌.. త‌గిన ఆధారాలు ఇస్తాడా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. రాహుల్ ఓ ముస్లిం వ్య‌క్తి అని - కానీ జంజం వేసుకున్న బ్రాహ్మ‌ణుడిని అంటూ చెప్పుకుంటున్నాడ‌ని అనంత్ విమ‌ర్శించారు. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ. రాజీవ్ త‌ల్లి ఇందిరా.. గుజ‌రాత్‌ కు చెందిన పార్సీ వ్య‌క్తి ఫిరోజ్ గాంధీని పెళ్లాడారు. అని కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించారు. ``గ‌త ఏడాది నవంబ‌ర్‌ లో రాజ‌స్థాన్‌ లో ఆల‌యానికి వెళ్లిన రాహుల్ అక్క‌డ త‌న గోత్రం పేరు చెప్పారు. కౌల్ బ్ర‌హ్మ‌ణ వంశ‌స్తుల‌మ‌న్నాడు. రాహుల్‌ కు ఈ దేశం గురించి తెలియ‌దు. మ‌తం గురించి కూడా అత‌నికి తెలియ‌దు. తండ్రి ముస్లిం-త‌ల్లి క్రిస్టియ‌న్‌-కొడుకు బ్ర‌హ్మ‌ణుడు` అని మంత్రి విమ‌ర్శించారు. రాజీవ్ చ‌నిపోయిన‌ప్పుడు డీఎన్ ఏ శ్యాంపిల్స్ ప‌రిశీల‌న కోసం న‌మూనాలు సేక‌రించార‌ని - అప్పుడు సోనియా .. త‌న కూతురు ప్రియాంకా శ్యాంపిల్స్ తీసుకోవాల‌ని కోరింద‌ని మంత్రి గుర్తు చేశారు. రాహుల్ డీఎన్ ఏ శ్యాంపిల్స్‌ ను వ‌ద్ద‌ని సోనియా చెప్పిన‌ట్లు మంత్రి తెలిపారు. రాహుల్ ను బ్రాహ్మణుడిగా గుర్తించడానికి డీఎన్ఏ పరీక్షలు చేయాలని అన్నారు.

ఈ సంద‌ర్భంగా బాలాకోట్ దాడిపై రాహుల్ ఆధారాలు అడ‌గ‌డాన్ని మంత్రి త‌ప్పుప‌ట్టారు. స‌ర్జిక‌ల్ దాడుల‌కు ఆధారాలు కావాల‌ని కాంగ్రెస్ నేత‌లు అడుగుతున్నార‌ని, ప్ర‌పంచం అంతా అంగీక‌రించినా వాళ్లు మాత్రం ఆధారాల కోసం వెతుకుతున్నార‌ని మండిప‌డ్డారు. ఇదిలాఉండ‌గా, సిర్సి పట్టణం హెగ్డే స్వస్థలం. 2014 లోక్ సభ ఎన్నికల్లో ఆయన ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ స్థానం నుంచి ఆయన నాలుగుసార్లు విజయం సాధించారు.