Begin typing your search above and press return to search.
హిందూ అమ్మాయి మీద చేయి పడితే నరికేయటమేనట!
By: Tupaki Desk | 28 Jan 2019 11:12 AM GMTఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఓటర్లను ఆకర్షించేందుకు సంక్షేమ కార్యక్రమాల్ని.. వరాల మూటల్ని విప్పి చెప్పే ప్రయత్నం కొందరు చేస్తే.. వివాదాస్పద వ్యాఖ్యలతోనూ.. వర్గాల వారీగా ఓట్లను చీల్చేసి ప్రయోజనం పొందే ప్లాన్ ను మరికొందరు చేస్తుంటారు. తన మీద ఉన్న మత పార్టీ ముద్రను వదిలించుకొని అందరి పార్టీ అన్నట్లు మారాలని భావిస్తున్న బీజేపీకి సైతం మింగుడుపడని రీతిలో కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
సంచలన వ్యాఖ్యలకు.. నోటికి తోచినట్లుగా మాట్లాడే అలవాటున్న బీజేపీ కేంద్రమంత్రుల్లో అనంతకుమార్ మరికాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. తాజాగా ఆయన కర్ణాటకలో మాట్లాడుతూ.. ఏ కులమైనా.. మతమైనా.. వర్గమైనా సరే.. హిందూ అమ్మాయి మీద చేయి వేస్తే వారి చేతిని కట్ చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ తరహా దూకుడు వ్యాఖ్యలు అనంతకుమార్ కు అలవాటే.
గతంలో రాజ్యాంగాన్ని మార్చేయటం బీజేపీకి మాత్రమే సాధ్యమవుతుందంటూ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన ఆయన.. తాజాగా హిందు మహిళ మీద చేయి వేసిన వారి చేతిని నరికేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. హిందు ఓటు బ్యాంకును గంపగుత్తగా తమ పార్టీకి సొంతంగా మరల్చుకోవాలన్నది అనంతకుమార్ ఆలోచనే అయితే.. అందరి పార్టీగా మారాలన్న బీజేపీ అధినాయకత్వానికి ఈ వ్యాఖ్యలు ఇబ్బందిగా మారతాయనటంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్రమంత్రి హోదాలో ఉండి.. ఇలా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం ఏమిటో?