Begin typing your search above and press return to search.
శానిటైజర్ తాగిన వైద్యాధికారి..ఎందుకు తాగారంటే?
By: Tupaki Desk | 10 April 2020 9:30 AM GMTకరోనా వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ అందరిని భయంతో వణికిపోయేలా చేస్తుంది. ఈ కరోనా వైరస్ బారిన పడిన రోగులకు వైద్యాధికారులు అహర్నిశలు వైద్యం అందిస్తున్నారు. అయితే , కొన్ని చోట్ల డాక్టర్లు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో చిన్న పొరపాటుతో ప్రభుత్వ వైద్యాధికారి ఆస్పత్రి పాలయ్యారు. అనంతపురం జిల్లాకు చెందిన వైద్యాధికారి అనిల్ కుమార్.. ఇంట్లో ఫోన్ లో మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో దాహం వేయడంతో ఆయన మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్ తాగేశారు.
దీనితో అనిల్ కుమార్ స్వల్ప అస్వస్థతకు గురికాగా - వెంటనే కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనంత రామిరెడ్డి ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రస్తుతం వైద్యాధికారి చికిత్స పొందుతున్నారు. ఆయనకి ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. అయితే డాక్టర్ శానిటైజర్ తాగడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే తాగారా? లేదంటే ఆక్సిడెంట్ గా తాగారా అన్నది తెలియాల్సి ఉంది.
ఇకపోతే అనంతపురంలో కరోనా రోజులకి ట్రీట్ మెంట్ ఇస్తున్న వైద్యాధికారులకి కూడా కరోనా సోకింది. దీనితో సరిపడా మాస్క్ లు - రక్షణ పరికరాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ 2020 - ఏప్రిల్ 09వ తేదీ గురువారం..నిరసనలు వ్యక్తం చేశారు. దీనిని పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామినిచ్చారు. రోజురోజుకూ అనంతలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెల్త్ బులెటిన్ లో ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 15. ఇదిలా ఉంటే.. ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 365కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. 10మంది డిశ్చార్జ్ అయ్యారు.