Begin typing your search above and press return to search.

ఆ విషయంలో చంద్రబాబుని అనంతపూర్ వాళ్లు కడిగిపారేశారా?

By:  Tupaki Desk   |   7 Sep 2020 4:00 PM GMT
ఆ విషయంలో చంద్రబాబుని అనంతపూర్ వాళ్లు కడిగిపారేశారా?
X
చేయాల్సిన టైంలో చేయకపోతే ఎంత ఉపద్రవమో ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలిసి వస్తుందని అంటున్నారు. గత ప్రభుత్వంలో సీఎంగా ఉంటూ పార్టీని పట్టించుకోనందుకు చంద్రబాబు ఫలితం అనుభవించారు. ఇప్పుడు బతిమిలాడుతున్న కార్యకర్తలు చంద్రబాబును పట్టించుకోని పరిస్థితి నెలకొందని పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది.తాజాగా చంద్రబాబు ముఖం మీదే కార్యకర్తలు చెప్పిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమవుతోందట..

అనంతపూర్ పార్లమెంట్ రివ్యూలో చంద్రబాబును కార్యకర్తలు, నాయకులు కడిగిపారేశారట.. టీడీపీ బలంగా ఉన్న అనంతపూర్ జిల్లాలో టీడీపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచిందంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు అని నిలదీశారట. అందులో ఒకటి బాలక్రిష్ణ, రెండోవది పయ్యావుల కేశవ్.

టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా మమ్మలను పట్టించుకోకుండా.. రివ్యూలు చేయకుండా.. కార్యకర్తలు ఉన్నారని కూడా చూడకుండా దూరం పెట్టారని వారంతా ఆడిపోసుకున్నారట.. అందుకే 2019 ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేల కోసం పనిచేయలేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారట.. ఎమ్మెల్యేలు కానీ ఇన్ చార్జిలు కానీ ఇప్పుడు పత్తాలేకుండా పోయారని.. ఈరోజు కేసులు పెడితే భయంతో దిక్కులేకుండా పోయామని ఆవేదన వ్యక్తం చేశారట..

ముఖ్యంగా పరిటాల శ్రీరాం మీద ఎక్కువ ఫిర్యాదులు చంద్రబాబు కు చేశారని వినికిడి. ఇక్కడ రాప్తాడు వదిలి హైదరాబాద్ కు వెళ్లాడని.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నాడని.. మేము ఏమైనా పట్టించుకోడు అని పరిటాల సునీత మేలు అని సూచించారట.. అలాగే అందరినీ కూర్చోబెట్టి మాకు న్యాయం చేస్తే పార్టీలో పనిచేస్తామని.. లేకుంటే మా వల్ల కాదు అని తెగేసి చెప్పారంట..

అప్పుడు చంద్రబాబు వాళ్లను సముదాయించి ‘నేను తప్పు చేశాను.. ఒప్పుకుంటా.. ఆ ప్రభుత్వం మీద దృష్టిపెట్టి పార్టీ మీద పట్టుకోల్పోయాను అని.. ఇప్పుడు అలాగా ఉండదు అని.. మనం అందరం కష్టపడుదామని ప్రభుత్వాన్ని మళ్లీ కష్టపడి తెచ్చుకుందాం.. ఇలా చేయద్దని’ చంద్రబాబు హామీ ఇచ్చాడట.. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం వినలేదని ప్రచారం సాగుతోంది. చంద్రబాబు చెప్పినా పట్టించుకోకుండా ‘చూద్దాం మరి’ అని కార్యకర్తలు అని వెళ్లిపోయారని జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి.